ఎలక్ట్రిక్ వాహన సంస్థ టాటా.ఈవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా 14 కొత్త మెగా చార్జర్లను ప్రారంభించినట్టు ప్రకటించింది. వోల్ట్రాన్ భాగస్వామ్యంతో వీటిని అభివృద్ధి చేసినట్టు తెలిపింది. ఇవి పూర్తిగా మనుషులతో నిర్వహించే చార్జర్లు అని.. సౌకర్యమైన, మన్నికైన సేవలను అందించడమే లక్ష్యమని ప్రకటించింది. రోజులో 24 గంటలూ వీటి సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇలాంటి మెగా చార్జర్లు 70 ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నట్టు తెలిపింది.
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే మౌలిక సదుపాయాలైన ఛార్జింగ్ స్టేషన్స్ మాత్రం తక్కువగా ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు.. ఎప్పటికప్పుడు ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తున్నాయి. ఇవి ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.


