టాటా మోటార్స్‌ అంతర్జాతీయ విక్రయాలు డౌన్‌ | Tata Motors international sales down | Sakshi
Sakshi News home page

టాటా మోటార్స్‌ అంతర్జాతీయ విక్రయాలు డౌన్‌

May 11 2017 3:22 AM | Updated on Sep 5 2017 10:51 AM

టాటా మోటార్స్‌ అంతర్జాతీయ విక్రయాలు ఏప్రిల్‌ నెలలో 9 శాతం క్షీణతతో 73,691 యూనిట్లకు తగ్గాయి. గతేడాది ఏప్రిల్‌లో కంపెనీ విక్రయాలు 81,333 యూనిట్లుగా నమోదయ్యాయి.

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌ అంతర్జాతీయ విక్రయాలు ఏప్రిల్‌ నెలలో 9 శాతం క్షీణతతో 73,691 యూనిట్లకు తగ్గాయి. గతేడాది ఏప్రిల్‌లో కంపెనీ విక్రయాలు 81,333 యూనిట్లుగా నమోదయ్యాయి. ప్యాసెంజర్‌ వాహన అమ్మకాలు 6 శాతం వృద్ధితో 51,749 యూనిట్ల నుంచి 54,847 యూనిట్లకు పెరిగాయి. జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ విక్రయాలు 2.41 శాతం వృద్ధితో 40,933 యూనిట్ల నుంచి 41,923 యూనిట్లకు ఎగశాయి. కమర్షియల్‌ వాహన అమ్మకాలు 36 శాతం క్షీణతతో 29,584 యూనిట్ల నుంచి 18,844 యూనిట్లకు తగ్గాయి.

Advertisement
 
Advertisement
Advertisement