జంషెట్జీ టాటా స్మారక నాణేలు విడుదల | Tata jamshetji release commemorative coins | Sakshi
Sakshi News home page

జంషెట్జీ టాటా స్మారక నాణేలు విడుదల

Jan 7 2015 1:08 AM | Updated on Aug 15 2018 2:20 PM

జంషెట్జీ టాటా స్మారక నాణేలు విడుదల - Sakshi

జంషెట్జీ టాటా స్మారక నాణేలు విడుదల

జంషెట్జీ టాటా గౌరవార్థం స్మారక నాణేలను(రూ.100, రూ.5) ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం విడుదల చేశారు.

న్యూఢిల్లీ: జంషెట్జీ టాటా  గౌరవార్థం  స్మారక నాణేలను(రూ.100, రూ.5) ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం  విడుదల చేశారు. ఆధునిక భారత పరిశ్రమ పితామహుడిగాప్రాచుర్యం పొందిన జంషెట్జీ టాటా 175 వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నాణేలను రూపొందించారు. భారత ప్రభుత్వం ఒక పారిశ్రామికవేత్త జ్ఞాపకార్థం స్మారక నాణేలను విడుదల చేయడం ఇదే మొదటిసారి. జంషెట్జీ  ఎలాంటి అధికారం లేకుండానే చరిత్ర సృష్టించారని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ ప్రశంసించారు.

పర్యావరణ అనుకూల ఇంధనాల కోసం ఆయన ప్రయత్నాలు చేశారని, టాటా గ్రూపు ఉద్యోగుల సంక్షేమం కోసం ఇతోధికంగా కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టాటా సన్స్ చైర్మన్ సైరస్ పి. మిస్త్రీ తదితరులు పాల్గొన్నారు.   గుజరాత్‌లోని నవసారిలో 1839, మార్చి 3న జన్మించిన జంషెట్జీ  1868లో టాటా గ్రూప్‌ను స్థాపించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement