టఫే చేతికి సెర్బియా ట్రాక్టర్‌ కంపెనీ

TAFE acquires Serbian tractor maker IMT - Sakshi

న్యూఢిల్లీ: సెర్బియాకు చెందిన ట్రాక్టర్‌ కంపెనీ ఐఎంటీని టఫే కంపెనీ కొనుగోలు చేసింది. సెర్బియాకు చెందిన ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ యంత్రాలు తయారు చేసే ఐఎంటీని కొనుగోలు చేశామని టాఫే కంపెనీ మంగళవారం తెలిపింది. అయితే, ఈ డీల్‌కు సంబంధించిన లావాదేవీలను వివరాలను టఫే (ట్రాక్టర్స్‌ అండ్‌ ఫార్మ్‌ ఎక్విప్‌మెంట్‌) వెల్లడించలేదు.

భవిష్యత్‌ వృద్ధికి ఐఎమ్‌టీ కీలకం...
ఐఎమ్‌టీతో తమకు దీర్ఘకాలంగా అనుబంధం ఉందని టఫే చైర్‌పర్సన్, సీఈఓ మల్లిక శ్రీనివాసన్‌ తెలిపారు.  తూర్పు యూరప్, ఉత్తర ఆఫ్రికా, బాల్కిన్‌ దేశాల్లో ఐఎమ్‌టీ బ్రాండ్‌ చాలా పాపులర్‌ అని, ఈ కంపెనీ 35 హెచ్‌పీ నుంచి 210 హెచ్‌పీ రేంజ్‌లో ట్రాక్టర్లను తయారు చేస్తుందని ఆమె వివరించారు.

ఇరు కంపెనీల మధ్య విడిభాగాల సరఫరా, టెక్నాలజీ సపోర్ట్, తదితర అంశాల్లో కొన్ని దశాబ్దాలుగా వాణిజ్య అనుబంధం ఉందని వెల్లడించారు. భవిష్యత్తు వృద్ధి, వ్యూహాత్మక ప్రణాళికలకు ఐఎమ్‌టీ  కొనుగోలు కీలకం కానున్నదని వ్యాఖ్యానించారు. ఈ డీల్‌లో భాగంగా ఐఎమ్‌టీ బ్రాండ్,  డిజైన్లు, ట్రేడ్‌మార్క్‌లు, కాపీ రైట్స్‌ వంటి మేధోపరమైన హక్కులను వినియోగించుకునే హక్కు తమకు లభిస్తుందని వివరించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top