డెబిట్‌ కార్డులపై ఎస్‌బీఐ న్యూ అలర్ట్‌

Switch to chip-based debit cards by Dec 31 - Sakshi

డిసెంబర్‌ 31లోగా ప్రస్తుత కార్డులు మార్చుకోవాలి

ఖాతాదారులకు ఎస్‌బీఐ సూచన

న్యూఢిల్లీ: ఈ ఏడాది డిసెంబర్‌ 31లోగా ప్రస్తుత మాగ్నెటిక్‌ స్ట్రైప్‌ ఏటీఎం కమ్‌ డెబిట్‌ కార్డులను సరికొత్త ఈఎంవీ చిప్‌ ఆధారిత కార్డులతో మార్చుకోవాలని ఖాతాదారులకు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ సూచించింది. ఇది పూర్తిగా సురక్షితమైన ప్రక్రియేనని, కొత్త కార్డుల జారీకి ఎటువంటి చార్జీలు ఉండవని మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌లో ఎస్‌బీఐ ట్వీట్‌ చేసింది. నకిలీ కార్డు మోసాలకు ఆస్కారమివ్వని ఈఎంవీ (యూరోపే, మాస్టర్‌కార్డ్, వీసా) చిప్‌ కార్డులు సురక్షితమైనవని పేర్కొంది.

జూన్‌ ఆఖరు నాటికి ఎస్‌బీఐ 28.9 కోట్ల ఏటీఎం–డెబిట్‌ కార్డులు జారీ చేయగా, ఇందులో సింహభాగం చిప్‌ ఆధారితమైనవే. కొత్త చిప్‌ డెబిట్‌ కార్డు కోసం హోమ్‌ బ్రాంచీలో సంప్రదించవచ్చని లేదా ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఎస్‌బీఐ సూచించింది. ఏటీఎం కార్డులకు సంబంధించిన మోసాలబారిన పడకుండా ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించే క్రమంలో కేవలం చిప్‌ ఆధారిత, పిన్‌ నంబర్‌ ఆధారిత డెబిట్, క్రెడిట్‌ కార్డులు మాత్రమే జారీ చేయాలంటూ బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించడం తెలిసిందే.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top