మార్కెట్లోకి సుజుకీ వి-స్ట్రామ్‌ బైక్‌ | Suzuki Motorcycle launches new edition of V-Strom 650XT | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి సుజుకీ వి-స్ట్రామ్‌ 650 ఎక్స్‌టి (2019)

Jan 28 2019 8:03 PM | Updated on Jan 28 2019 8:26 PM

Suzuki Motorcycle launches new edition of V-Strom 650XT - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా కొత్త ప్రీమియం మోటార్‌ బైక్‌ మోడల్‌ను లాంచ్‌ చేసింది. అడ్వెంచర్‌ టూరర్‌ బైక్‌ వి-స్ట్రామ్‌ 650ఎక్స్‌టి ఏబీఎస్‌(2019) ను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. రెండు రంగుల్లో లభించనున్న ఈ బైక్‌ ధర రూ.7.46 లక్షలు (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌).  

కొత్త గ్రాఫిక్స్‌, అదనపు ఫీచర్లతో  వి-స్ట్రామ్‌ కొత్త వెర్షన్‌ భారతీయ వినియోగదారులకు అద్భుతమైన అడ్వెంచర్‌ అనుభూతిని అందిస్తుందని సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా ఎండీ సతోషి ఉచిడా వెల్లడించారు. గత ఏడాది లాంచ్‌ చేసిన ఈ వి- స్ట్రామ్‌ మోటార్‌  సైకిల్‌కు  మంచి ఆదరణ లభించిందనీ, ఇపుడు  కూడా అదే స్పందన లభిస్తుందని తాము ఆశిస్తున్నామన్నారు. లైట్‌ వెయిట్‌ యాంటీ లాక్‌ బ్రేక్‌ సిస్టమ్‌.. రహదారిపై పట్టును కోల్పోకుండా చేస్తుందని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement