సుజుకి జిక్సెర్‌ కొత్త బైక్‌.. | Suzuki launches all new Suzuki Gixxer at Rs 1 lakh | Sakshi
Sakshi News home page

సుజుకి జిక్సెర్‌ కొత్త బైక్‌..

Jul 12 2019 3:06 PM | Updated on Jul 12 2019 5:00 PM

Suzuki launches all new Suzuki Gixxer at Rs 1 lakh - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్  అనుబంధ సంస్థ  సుజుకి మోటార్ కార్పొరేషన్ శుక్రవారం సరికొత్త సుజుకి జిక్సెర్‌ను  లాంచ్‌ చేసింది.  155 సీసీ ఇంజీన్‌, ఏబీఎస్‌ టెక్నాలజీతో ఈ బైక్‌ను ఆవిష్కరించింది.  దీని ధరను  రూ .1 లక్ష (ఎక్స్-షోరూమ్‌, ఢిల్లీ)గా నిర్ణయించింది. 


కొత్త సుజుకి జిక్సెర్‌లో 155 సిసి, ఫోర్-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్షన్, ఎస్‌ఈపీ, టెక్నాలజీతో ఎయిర్-కూల్డ్ ఇంజిన్ లాంటివి స్పెషల్‌ ఫీచర్లుగా ఉన్నాయి. షార్ప్‌ స్టైలింగ్ లో క్రచ్‌డ్‌  సిల్హౌట్ తో వస్తుంది. రూపొందించిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, విలక్షణమైన ఫ్రంట్  అండ్‌  రియర్ కాంబినేషన్ ఎల్‌ఇడి హెడ్‌లైట్‌లను ప్రత్యేకంగా అమర్చింది. కొత్త సుజుకి జిక్సెర్ మూడు రంగులలో  లభించనుంది.  సుజుకి మోటార్ సైకిల్ ఇండియా బలమైన వేగంతో వృద్ధి చెందుతోంది,  ప్రధానంగా తాజా సుజుకి జిక్సెర్‌ మోటారు సైక్లింగ్ అభిమానులను ఆహ్లాదపరుస్తుందనీ, కొత్త ఉత్సాహాన్ని, విశ్వాసాన్నిస్తుందని తాము నమ్ముతున్నామని సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ దేవాషిష్ హండా అన్నారు. 



Advertisement
 
Advertisement
Advertisement