రికవరీ కళకళ : సెన్సెక్స్‌ హై జంప్‌

Stockmarkets high jump rallys 750 points - Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. గత వారంలో భారీగా నష్టపోయిన మార్కెట్లు సోమవారం భారీగా పుంజుకున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలతో కళకళ లాడుతున్నాయి. షార్ట్‌ కవరింగ్‌ కారణంగా కీలక సూచీలు  లాభపడుతున్నాయని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. అప్రమత్తత అవసరం మని హెచ్చరిస్తున్నారు. సెన్సెక్స్‌ ఆరంభ లాభాలనుంచి పుంజుకుని ప్రస్తుతం 750 పాయింట్లకు పైగా ఎగియగా, నిఫ్టీ డబుల్‌ సెంచరీ లాభాలతో దూసుకపోతోంది. ప్రధానంగా ఐటీ, మెటల్‌, బ్యాంకింగ్‌  షేర్లు లాభాలతో కొనసాగుతున్నాయి.  ఐసీఐసీఐబ్యాంకు, హెచ్‌సీఎల్‌ టెక్‌, జీ, ఐవోసీ, వేదాంతా, యూపీఎల్‌, ఐషర్‌ మోటార్స్‌, కోల్‌ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టైటన్‌ లాభపడుతుండగా, కోటక్‌ మహీంద​, టెక్‌ మహీంద్ర నష్టపోతున్నాయి.  అటు డాలరుమారకంలో రూపాయి కూడా  లాభాలతో పాజిటివ్‌గా  ట్రేడింగ్‌ను ఆరంభించింది.  20 పైసలు ఎగిసి 72.04 వద్ద కొనసాగుతోంది.

చదవండి:  రూ.2 వేల నోటు : ఆర్థికమంత్రి కీలక ప్రకటన

కోవిడ్‌ క్రాష్‌ : అంబానీకి నష్టం ఎంతంటే?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top