హైదరాబాద్‌–కొలంబో మధ్య శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌ సర్వీసు | Sri Lankan Airlines service between Hyderabad-Colombo | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌–కొలంబో మధ్య శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌ సర్వీసు

May 18 2017 1:42 AM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్‌–కొలంబో మధ్య శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌ సర్వీసు - Sakshi

హైదరాబాద్‌–కొలంబో మధ్య శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌ సర్వీసు

విమానయాన రంగంలో ఉన్న శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌ కొలంబో నుంచి మరో మూడు భారతీయ నగరాలకు సర్వీసులను విస్తరిస్తోంది.

వైజాగ్, కోయంబత్తూరుకు సైతం
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: విమానయాన రంగంలో ఉన్న శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌ కొలంబో నుంచి మరో మూడు భారతీయ నగరాలకు సర్వీసులను విస్తరిస్తోంది. హైదరాబాద్, విశాఖపట్నం, కోయంబత్తూరు వీటిలో ఉన్నాయి. జూలై 8 నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్‌ నుంచి సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో ప్రతిరోజు ఉదయం 9.50కి బయల్దేరి 11.45కు విమానం కొలంబో చేరుకుంటుంది. విశాఖపట్నం నుంచి సోమ, గురు, శని, ఆదివారాల్లో ఉదయం 10.10కి మొదలైన విమానం మధ్యాహ్నం 12.15కు కొలంబోలో అడుగుపెడుతుంది. కొత్త రూట్లకు ఎయిర్‌బస్‌ 320/321 రకం విమానాలను కంపెనీ కేటాయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement