నిలిచిన స్పైస్జెట్ విమాన సర్వీసులు! | SpiceJet flight operations grounded | Sakshi
Sakshi News home page

నిలిచిన స్పైస్జెట్ విమాన సర్వీసులు!

Dec 17 2014 10:55 AM | Updated on Oct 2 2018 7:37 PM

నిలిచిన స్పైస్జెట్ విమాన సర్వీసులు! - Sakshi

నిలిచిన స్పైస్జెట్ విమాన సర్వీసులు!

పీకల్లోతు నష్టాల్లో ఉన్న స్పైస్‌జెట్‌ సేవలు బుధవారం నిలిచిపోయాయి. ఇంధనం సరఫరా చేయరాదని ఆయిల్‌ కంపెనీలు ...

న్యూఢిల్లీ : పీకల్లోతు నష్టాల్లో ఉన్న స్పైస్‌జెట్‌ సేవలు బుధవారం నిలిచిపోయాయి. ఇంధనం సరఫరా చేయరాదని  ఆయిల్‌ కంపెనీలు నిర్ణయించటంతో  స్పైస్‌ జెట్‌ విమానాలన్నీ  హ్యాంగర్లకే పరిమితమైయ్యాయి.  కాగా  స్పైస్‌జెట్‌ను ఒడ్డున పడేసేందుకు సహకరించాలని పౌరవిమానయాన శాఖ  బ్యాంకులను కోరింది.  దాదాపు 600 కోట్ల రూపాయల్ని వర్కింగ్‌ కేపిటల్‌గా ప్రొవైడ్‌ చేయాలని సూచించింది. ఈ మొత్తానికి సంస్థ చైర్మన్ కళానిధి మారన్‌ వ్యక్తిగత గ్యారెంటీగా ఉంటారని కూడా తెలిపింది.  

రూ. 200 కోట్ల బకాయిలను చెల్లించడానికి  కొంత వెసులుబాటును స్పైస్‌జెట్‌కు ఇస్తూ ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) సోమవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మరిన్ని నిధులను స్పైస్‌జెట్‌కు అందిస్తానని సన్ గ్రూప్ ప్రమోటర్లలలో ఒకరైన కళానిధి మారన్ వ్యక్తిగత పూచీకత్తు నివ్వడంతో ఏఏఐ ఈ నిర్ణయం తీసుకుంది.

మరో వైపు గట్టెక్కేందుకు తాము దీర్ఘకాలిక వ్యూహం సిద్ధం చేస్తున్నామని...  దానికి ఎనిమిది వారాల సమయం పడుతుందని స్పైస్‌ జెట్‌ ప్రభుత్వానికి తెలిపింది.  స్పైస్‌జెట్‌ సంక్షోభం అటు స్టాక్‌ మార్కెట్‌పై ప్రభావం చూపింది.  స్పైస్‌ జెట్‌ షేర్‌ దాదాపు ఆరున్నర శాతం పతనమైంది.   ఆయిల్‌ కంపెనీలు,  ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియాకు స్పైస్‌జెట్‌ దాదాపు రెండు వేల కోట్ల రూపాయల బకాయి పడింది.

Advertisement
 
Advertisement
Advertisement