సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొత్త షోరూమ్ ప్రారంభం | South India Shopping Mall @ Somajiguda | Sakshi
Sakshi News home page

సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొత్త షోరూమ్ ప్రారంభం

Sep 23 2016 1:49 AM | Updated on Sep 4 2017 2:32 PM

సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొత్త షోరూమ్ ప్రారంభం

సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొత్త షోరూమ్ ప్రారంభం

సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొత్త ఔట్‌లెట్‌ను హైదరాబాద్‌లోని సోమాజిగూడలో ఏర్పాటు చేసింది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొత్త ఔట్‌లెట్‌ను హైదరాబాద్‌లోని సోమాజిగూడలో ఏర్పాటు చేసింది. సినీతారలు అఖిల్ అక్కినేని, సమంత ఈ స్టోర్‌ను గురువారం ప్రారంభించారు. ఇప్పటికే సంస్థ హైదరాబాద్‌లో కొత్తపేట్, ప్యాట్నీ సెంటర్, కూకట్‌పల్లి, అమీర్‌పేట్, గచ్చిబౌలి, అత్తాపూర్‌తోపాటు విజయవాడ, గుంటూరులోనూ ఔట్‌లెట్లను నిర్వహిస్తోంది. ఒకట్రెండు నెలల్లో సికింద్రాబాద్ పార్క్‌లేన్‌తోపాటు వైజాగ్‌లో సెంటర్లను ప్రారంభించనున్నట్టు సంస్థ డెరైక్టర్ సురేష్ సీర్న తెలిపారు. డెరైక్టర్లు స్పందన, అభినయ్, రాకేష్, కేషవ్‌తో కలిసి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఆరేళ్లలోనే నంబర్ 1 ఫ్యామిలీ షాపింగ్ మాల్‌గా ఎదిగామని వివరించారు. మరిన్ని నగరాలకు విస్తరిస్తామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement