
న్యూఢిల్లీ: సోనీ ఇండియా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ’ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్2’ బుధవారం విడుదలయింది. ప్రపంచంలోనే తొలిసారిగా 4కే హెచ్‌డీఆర్ మూవీ రికార్డింగ్ ఫీచర్‌ను అందిస్తున్న ఈ ఫోన్ ధర రూ.72,990. భారత్‌లో అందుబాటులో ఉన్న తమ కంపెనీ స్మార్ట్‌ఫోన్లలో ఇదే అత్యంత ఖరీదైన మొబైల్‌గా పేర్కొంది.
5.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 845 ప్రొసెసర్, 3180 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ, సిక్స్ జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీని కలిగిన ఈ ఫోన్‌లో సూపర్ స్లో మోషన్ వీడియో రికార్డింగ్ సదుపాయం ఉంది. ఆగస్టు 1 నుంచి ఎంపిక చేసిన సోనీ సెంటర్లు, రిటైల్ స్టోర్లలో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుందని సోనీ ఇండియా ప్రకటించింది.