breaking news
Xperia Z2
-
సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్జెడ్2@రూ.72,990
న్యూఢిల్లీ: సోనీ ఇండియా ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ’ఎక్స్‌పీరియా ఎక్స్జెడ్2’ బుధవారం విడుదలయింది. ప్రపంచంలోనే తొలిసారిగా 4కే హెచ్డీఆర్ మూవీ రికార్డింగ్ ఫీచర్‌ను అందిస్తున్న ఈ ఫోన్ ధర రూ.72,990. భారత్‌లో అందుబాటులో ఉన్న తమ కంపెనీ స్మార్ట్ఫోన్లలో ఇదే అత్యంత ఖరీదైన మొబైల్గా పేర్కొంది. 5.7 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 845 ప్రొసెసర్, 3180 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, సిక్స్ జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీని కలిగిన ఈ ఫోన్లో సూపర్ స్లో మోషన్ వీడియో రికార్డింగ్ సదుపాయం ఉంది. ఆగస్టు 1 నుంచి ఎంపిక చేసిన సోనీ సెంటర్లు, రిటైల్ స్టోర్లలో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుందని సోనీ ఇండియా ప్రకటించింది. -
మైక్రోసాఫ్ట్ తొలి డ్యుయల్ సిమ్ లూమియా
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ కంపెనీ తొలి డ్యుయల్ సిమ్ హ్యాండ్సెట్ లూమియా 630 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్ ధర రూ.11,500. నోకియా హ్యాండ్సెట్స్ వ్యాపారాన్ని కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్ ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ నెల 16 నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. వన్ డ్రైవ్ ఫీచర్ ఈ మోడల్లో సింగిల్ సిమ్ వేరియంట్ ధర రూ.10,500 అని నోకియా ఇండియా ఎండీ, పి. బాలాజీ పేర్కొన్నారు. రెండు రకాల ఫోన్లలలో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు అన్నీ ఒకే విధంగా ఉన్నాయి. 4.5 అంగుళాల క్లియర్ బ్లాక్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, వన్ డ్రైవ్(డాక్యుమెంట్లు, ఫొటోలు, మ్యూజిక్‌లను ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేసుకునే క్లౌడ్ స్టోరేజ్ సౌకర్యం), రియర్ షెల్స్‌ను మార్చుకునే సౌకర్యం, 1.2 గిగాహెట్జ్ క్వాడ్ కోర్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 8 జీబీ స్టోరజ్, 5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, స్వైప్ సౌకర్యమున్న కొత్త కీబోర్డ్ వంటి ఫీచర్లున్నాయి. పెడో మీటర్స్ వంటి ఆరోగ్య సంబంధిత యాప్స్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా లేదు. 3జీ డ్యుయల్ సిమ్ సపోర్ట్ ఉన్న ఈ ఫోన్ బరువు 134 గ్రాములు.