
సాక్షి, ముంబై: అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. వెంటనే నష్టాలలోకి ప్రవేశించాయి. కోవిడ్ -19 మహమ్మారి ఆర్థిక పతనానికి వ్యతిరేకంగా ఆర్థిక టాస్క్‌ఫోర్స్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంతో ఉద్దీపన ప్యాకేజీ ఆశల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు నాలుగు సెషన్ల నష్టాలకు శుక్రవారం చెక్ పెట్టాయి. నేడు కూడా లాభ నష్టాల మధ్య తీవ్రంగా ఊగిసలాడిన సెన్సెక్స్ ఒక దశలో 2వేల పాయింట్లు ఎగిసి 30,418 పాయింట్ల స్థాయిని తాకింది. నిఫ్టీ కూడా భారీగా లాభపడి 8,883 వద్దకు చేరింది. ప్రస్తుతం 1038 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 29340 వద్ద, నిఫ్టీ 316 పాయింట్లు ఎగిసి 8573 వద్ద కొనసాగుతోంది. తొలుత సెన్సెక్స్ 160 పాయింట్ల లాభంతో 2846 వద్ద ప్రారంభమై 350 పాయింట్లకు పైగా నష్టపోయింది. బ్యాంకింగ్ షేర్లు నష్టపోతుండగా, నిఫ్టీ ఐటి ఇండెక్స్ 10.75 శాతం ఎగిసాయి. దీంతోపాటు ఎనర్జీ, కన్స్యూమర్ గూడ్స్ స్టాక్స్‌లో లాభాలు మార్కెట్లకు మద్దతు ఇ'స్తున్నాయి. ఓఎన్‌జిసి, గెయిల్, విప్రో, టీసీఎస్, హెచ్‌సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీ అత్యధిక శాతం లాభపడ్డాయి.