వరుస లాభాలకు బ్రేక్ | sensex Snaps Six-Day Rally Led By Losses In Auto Stocks | Sakshi
Sakshi News home page

వరుస లాభాలకు బ్రేక్

Jul 5 2016 4:25 PM | Updated on Oct 1 2018 6:38 PM

మంగళవారం నాటి దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి

ముంబైః మంగళవారం నాటి దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. అంచనాలకనుగుణంగానే మదుపర్లు లాభాల    స్వీకరణకుదిగడతో ఈక్విటీ సూచీలు నష్టాలను చవిచూశాయి.  111 పాయింట్ల నష్టంతో  సెన్సెక్స్  27,166 దగ్గర, నిఫ్టీ 35 పాయింట్ల  నష్టంతో 8,335 దగ్గర ముగిసింది. దీంతో ఆరు సెషన్ల లాభాలకు ఈ రోజు బ్రేక్ పడింది.  ఐటీ, పవర్, ఆయిల్  అడ్ గ్యాస్ స్టాక్స్ నష్టాలు మార్కెట్ ను ప్రభావింత చేశాయి.  


మరోవైపు ఫెర్టిలైజర్ రిటైల్ ధరలను తగ్గించాలనే   ప్రభుత్వం నిర్ణయడంతో ఎరువుల షేర్లు  కూడా భారీగా నష్టపోయాయి. కోరమండల్  ఇంటర్నేషనల్, జువారి అగ్రో కెమికల్స్ 12, 4 శాతం మేర నష్టపోయాయి. అయితే జై ప్రకాశ్ అసోసియేట్స్ 27 శాతం టాప్ గెయినర్ గా నిలిచింది.  సంస్థకు చెందిన  సిమెంట్ ప్లాంట్లను ఎక్కువ మొత్తానికి  అల్ట్రాటెక్  కొనుగోలు చేయడం  ప్రతికూల అంశంగా మారింది.  అటు బులియన్, రూపాయి విలువ కూడా మైనస్ లో ఉన్నాయి.  

 

Advertisement
 
Advertisement
Advertisement