స్టాక్‌మార్కెట్‌కు ఎన్నికల కిక్‌ | Sensex Nifty Surge To Highest Level  | Sakshi
Sakshi News home page

స్టాక్‌మార్కెట్‌కు ఎన్నికల కిక్‌

Mar 11 2019 4:47 PM | Updated on Mar 11 2019 6:45 PM

Sensex Nifty Surge To Highest Level  - Sakshi

సాక్షి, ముంబై : స్టాక్‌మార్కెట్లకు ఎన్నికల కిక్‌ బాగానే  తాకింది.  ప్రపంచ మార్కెట్ల బలహీనతల నేపథ్యంలోనూ ఉత్సాహంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు రోజంతా లాభాలతో దౌడు తీశాయి.  డబుల్‌,  ట్రిపుల్‌ సెంచరీ,చివర్లో మరింత ఎగిసి క్వాడ్రపుల్‌ సెంచరీని ( 400 పాయింట్లు) సైతం  సాధించింది. దీంతొ కీలక  సూచీలు ఏడాదిలో అత్యంత గరిష్టాన్ని తాకాయి.  చివరికి  37,000 పాయింట్ల మైలురాయిని  స్థాయికి ఎగువన దృఢంగా ముగిసింది.  సెన్సెక్స్‌ 383 పాయింట్లు జంప్‌ చేసి 37,054 వద్ద,  నిఫ్టీ 133 పాయింట్లు   ఎగిసి 11,168 వద్ద ముగిసింది.  2018 సెప్టెంబరు తరువాత  (సెన్సెక్స్‌ 37,121, నిఫ్టీ 11169)ఈ స్థాయిలో  ముగియడం ఇదే తొలిసారి. లోక్‌సభకు ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నేపథ్యంలో ఇన్వెస్టర్లకు ఉన్నట్టుండి జోష్‌వచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు.

ఒక్క ఐటీ తప్ప అన్ని రంగాలూ లాభాల్లో ముగిసాయి.  మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఆటో 2.5 శాతం చొప్పున ఎగియగా, ఈ బాటలో ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ సైతం 1 శాతం చొప్పున బలపడ్డాయి.   ఎయిర్‌టెల్‌ 8.5 శాతం దూసుకెళ్లగా.. హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఐషర్‌, ఇన్‌ఫ్రాటెల్‌, పవర్‌గ్రిడ్‌, కోల్‌ ఇండియా, ఐవోసీ, ఆర్‌ఐఎల్‌, హిందాల్కో 5.6-3 శాతం మధ్య జంప్‌చేశాయి. బ్లూచిప్స్‌లో ఎన్‌టీపీసీ, టీసీఎస్‌, జీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా మాత్రమే అదికూడా 1-0.5 శాతం మధ్య  నష్టపోయాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement