మానిఫెస్టో సెగ : నష్టాల్లో  మార్కెట్లు

Sensex, Nifty Give Up Early Gains  - Sakshi

సాక్షి,ముంబై :  దేశీ స్టాక్‌మార్కెట్లు  భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.  ఆరంభంలో పాజిటివ్‌గా ఉన‍్నప్పటికీ   మిడ్‌ సెషన్‌నుంచి అమ్మకాల వెల్లువెత్తింది.  2019 లోక్‌సభ ఎన్నికల సన్నాహాలలో భాగంగా అధికార పార్టీ బీజేపీ మ్యానిఫెస్టో విడుదల ఈ నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు బలహీనంగా కదులుతున్నాయి.  ఒకదశలో  డే హై  నుంచి ఏకంగా 400పాయింట్లు కుప్పకూలడం గమనార్హం. లాభనష్టాల మధ్య భారీ ఊగిసలాట ధోరణి కొనసాగుతోంది. 

ప్రస్తుతం సెన్సెక్స్‌ 237 పాయింట్లు పతనమై 38,624 వద్ద ట్రేడవుతోంది.  నిఫ్టీ సైతం 82 పాయింట్లు క్షీణించి 11583 వద్ద కదులుతోంది. అటు బీజేపీ ప్రకటించిన మానిఫెస్టో, ఇటు ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇవ్వడం కూడా మార్కెట్లపై ప్రభావాన్ని చూపుతున్నట్లు  నిపుణులు తెలిపారు.

పీఎస్‌యూ బ్యాంక్స్‌, మీడియా  సహా అన్ని రంగాల్లోనూ అమ్మకాల జోరు కొనసాగుతోంది.  లక్ష్మీ విలాస్‌బ్యాంక్‌, డీసీబీ, బ్యాంకు ఆఫ్‌ ఇండియా.  బజాజ్‌ ఫైనాన్స్‌, ఐవోసీ, అదానీ పోర్ట్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, సిప్లా, బీపీసీఎల్‌, ఆర్‌ఐఎల్‌, గెయిల్‌, వేదాంతా, ఐషర్‌  నష్టపోతుండగా, జెట్‌ఎయిర్‌వేస్‌, వోడాఫోన్‌ ఐడియా,  ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్, హెచ్‌యూఎల్‌, జీ, పవర్‌గ్రిడ్‌, కొటక్‌ బ్యాంక్‌, యూపీఎల్‌ లాభ పడుతున్నాయి.  

అటు డాలరు మారకంలో  దేశీయ కరెన్సీ  రూపాయి కూడా మ 69.66 వద్ద బలహీనంగా కొనసాగుతోంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top