లాభాల జోరు,  30వేల ఎగువకు సెన్సెక్స్ | Sensex ends higher Nifty Reclaims 8750  | Sakshi
Sakshi News home page

లాభాల జోరు,  30వేల ఎగువకు సెన్సెక్స్

Apr 7 2020 4:09 PM | Updated on Apr 7 2020 4:10 PM

Sensex ends higher Nifty Reclaims 8750  - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి.  అంతర్జాతీయ సానుకూల సంకేతాల మధ్య ఆరంభంలోనే  1300 పాయింట్లు ఎగిసాయి. ఆ తరువాత కొద్దిగా తడబడినా మిడ్ సెషన్ నుంచి వేగం పుంజుకుంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫార్మ, ఎఫ్ ఎంసీజీ, ఐటీ, ఆటో రంగాలషేర్లలో కొనుగోళ్లతో సెన్సెక్స్  ఏకంగా 2476 పాయింట్లు లాభపడింది. దీంతో సెన్సెక్స్ 30 వేల ఎగువన స్థిరంగా ముగిసింది. నిఫ్టీ కూడా 708 పాయింట్ల లాభంతో 8792 వద్ద పటిష్టంగా ముగిసింది. నిఫ్టీ బ్యాంకు 1813 పాయింట్లు ఎగిసింది. అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. ఇండస్ ఇండ్ 22 శాతం , యాక్సిస్ 20 శాతం, హిందాల్కో 17 శాతం, ఎం అండ్ ఎం 14 గ్రాసిం14  , మారుతి 10  లాభపడ్డాయి.   అటు డాలరు మారకంలో రూపీ కూడా 55పైసల లాభంతో ముగియడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement