చివర్లో పుంజుకున్న మార్కెట్‌ | Sensex Ends 172 Points And Nifty At 11910 | Sakshi
Sakshi News home page

చివర్లో పుంజుకున్న మార్కెట్‌

Dec 12 2019 2:17 AM | Updated on Dec 12 2019 2:17 AM

Sensex Ends 172 Points And Nifty At 11910 - Sakshi

ట్రేడింగ్‌ చివర్లో బ్యాంక్, ఐటీ, వాహన షేర్లలో కొనుగోళ్లు చోటు చేసుకోవడంతో బుధవారం స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉన్నా, ఇండెక్స్‌లో వెయిటేజీ అధికంగా ఉన్న బ్లూ చిప్‌ షేర్లలో షార్ట్‌ కవరింగ్‌ చోటు చేసుకోవడంతో మన మార్కె ట్‌ ముందుకే సాగింది. డాలర్‌తో రూపాయి మా రకం విలువ వరుసగా ఆరో రోజూ పుంజుకోవడం సానుకూల ప్రభావం చూపించింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,900 పాయింట్లపైకి ఎగబాకింది. 53 పాయింట్ల లాభంతో 11,910 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 173 పాయింట్లు పెరిగి 40,413 పాయింట్ల వద్దకు చేరింది

331 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌....
సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. మధ్యాహ్నం వరకూ పరిమిత శ్రేణిలో కదలాడింది. ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. చివరి గంటలో కోలుకొని లాభాల బాటపట్టింది. ఒక దశలో 105 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌ మరో దశలో 226 పాయింట్లు లాభపడింది.  రోజంతా 331 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. వృద్ధి అంచనాలను ఏడీబీ తగ్గించడం ఒకింత ప్రతికూలప్రభావం చూపించింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.  బుధవారం అర్థరాత్రి అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ రేట్ల నిర్ణయాన్ని వెలువరించనుండటం... ఇంగ్లండ్‌లో గురువారం ఎన్నికలు, అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఒప్పందానికి గడువు (ఈ నెల 15న) దగ్గర పడుతుండటం, ఈ వారంలోనే ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెలువడనుండటం వంటి పరిణామాలతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు.

►పెట్టుబడుల సమీకరణ విషయమై బుధవారం జరిగిన బోర్డ్‌ సమావేశం ఎలాంటి ఫలవంతమైన నిర్ణయం తీసుకోకపోవడంతో యెస్‌ బ్యాంక్‌ షేర్‌ 15 శాతం నష్టంతో రూ.42.80 వద్దకు చేరింది. సెన్సెక్స్‌లో బాగా ►కొన్ని ఆస్తులను విక్రయించడం ద్వారా రూ.17,500 కోట్లు సమీకరించనున్నదన్న వార్తల కారణంగా వొడాఫోన్‌ ఐడియా షేర్‌ 3 శాతం లాభంతో రూ.6.75 వద్ద ముగిసింది.  
►నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు ఊరటనిచ్చేలా క్రెడిట్‌ గ్యారంటీ స్కీమ్‌ నిబంధనలను కేంద్రం సవరించిందన్న వార్తలతో ఎన్‌బీఎఫ్‌సీ, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల షేర్లు పెరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement