స్థిర రేటుపై గృహ రుణాలు | SBI Plans To Bring Home Loans at Fixed Rates | Sakshi
Sakshi News home page

స్థిర రేటుపై గృహ రుణాలు

Sep 16 2019 4:13 AM | Updated on Sep 16 2019 4:13 AM

SBI Plans To Bring Home Loans at Fixed Rates - Sakshi

లేహ్‌: దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ స్థిర రేటుపై గృహ రుణాలను తీసుకురావాలనుకుంటోంది. ఇవి స్థిర రేటు (ఫిక్స్‌డ్‌) నుంచి అస్థిర రేటు(ఫ్లోటింగ్‌)కు మారే గృహ రుణాలు. అంటే ప్రారంభం నుంచి నిరీ్ణత కాలం వరకు (సుమారు ఐదు పదేళ్లు) ఒకటే వడ్డీ రేటు కొనసాగుతుంది. ఆ తర్వాత నుంచి మార్కెట్‌ రేట్లకు అనుగుణంగా గృహ రుణంపై రేటు మారుతుంటుంది. ఈ విధమైన గృహ రుణాలను ఆఫర్‌ చేయవచ్చా? అన్న దానిపై ఆర్‌బీఐ నుంచి స్పష్టత కోరినట్టు ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ తెలిపారు. లేహ్‌ వచి్చన సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని రకాల రిటైల్‌ రుణాలను ఫ్లోటింగ్‌ రేటు ఆధారంగానే అందించాలని, రుణాలపై రేట్లు రెపో వంటి ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ రేట్ల ఆధారంగానే ఉండాలని ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించిన విషయం గమనార్హం. ఆర్‌బీఐ నూతన మార్గదర్శకాల విడుదల అనంతరం ఫ్లోటింగ్‌ రేటు రుణాల విషయంలో ఏ విధంగా వ్యవహరించాలన్న విషయమై స్పష్టత లేదన్నారు రజనీష్‌ కుమార్‌.  

కస్టమర్లు కోరుకుంటున్నారు..
కొంత మంది కస్టమర్లు గృహ రుణాలపై రేట్లు స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నట్టు ఆయన చెప్పారు. అటువంటి వారి కోసం ఫిక్స్‌డ్‌–ఫ్లోటింగ్‌ రేటు ఉత్పత్తులను అందించాలని అనుకుంటున్నట్టు తెలిపారు. వీటిల్లో ఐదు లేదా పదేళ్ల వరకు వడ్డీ రేటు స్థిరంగా ఉంటుందన్నారు. కొంత కాలం తర్వాత ఫ్లోటింగ్‌ రేటుకు మార్చడం... భవిష్యత్తు పరిస్థితులను బ్యాంకు అంచనా వేయలేకపోవడం వల్లనేనన్నారు. సాధారణంగా గృహ రుణాల కాల వ్యవధి 30 ఏళ్ల వరకు ఉంటాయన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆస్తుల నిర్వహణ బాధ్యతల విషయంలో 30 ఏళ్ల కాలానికి స్థిర రేటు ఉత్పత్తిని ఆఫర్‌ చేయడం కష్టమని వివరించారు. ఎస్‌బీఐ గరిష్టంగా 30 ఏళ్ల కాలానికే గృహ రుణాలను అందిస్తోంది. ప్రస్తుతానికి ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత ఫ్లోటింగ్‌ రేటు గృహ రుణాలను ఆఫర్‌ చేస్తోంది. రెపో రేటు ఆధారిత ఫ్లోటింగ్‌ రుణాలపై రేట్లు తరచుగా మారే పరిస్థితులు ఉంటుంటాయి. ఆర్‌బీఐ రేపో రేటును సవరించినప్పుడల్లా బ్యాంకులు కూడా ఆ మేరకు మార్పులు చేయాల్సి వస్తుంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement