‘ఏ సిరీస్‌’ స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో శాంసంగ్‌ రికార్డు  

Samsung says it sold 2 milion A series smartphones in 40 days - Sakshi

40 రోజుల్లో 20 లక్షల యూనిట్ల అమ్మకాలు 

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌.. తన ‘ఏ సిరీస్‌’ స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో రికార్డు సృష్టించినట్లు సోమవారం ప్రకటించింది. కేవలం 40 రోజుల్లోనే ఏకంగా 20 లక్షల యూనిట్ల విక్రయాలు పూర్తిచేయగా.. వీటి విలువ దాదాపు రూ.3,500 కోట్లని సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్, చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ రంజివిజిత్‌ సింగ్‌ వెల్లడించారు.

చిన్న నగరాలు, మెట్రోల నుంచి ఏ50, ఏ30, ఏ10 స్మార్ట్‌ఫోన్లకు అనూహ్య స్పందన లభిస్తుందని చెప్పారయన. కంపెనీ నిర్థేశించుకున్న 4 బిలియన్ల ఆదాయ లక్ష్యాన్ని చేరుకుంటామని ఈ సందర్భంగా ధీమా వ్యక్తంచేశారు. వచ్చే కొద్ది వారాల్లోనే గెలాక్సీ ఏ80, ఏ70, ఏ2 కోర్‌ విడుదల ఉండనుందని వెల్లడించారు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top