సామ్‌సంగ్‌ అన్ని స్మార్ట్‌ఫోన్లలో ‘పే’ యాప్‌ | Samsung Pay is coming to all Samsung smartphones in 2017 | Sakshi
Sakshi News home page

సామ్‌సంగ్‌ అన్ని స్మార్ట్‌ఫోన్లలో ‘పే’ యాప్‌

Dec 16 2016 1:18 AM | Updated on Nov 6 2018 5:26 PM

సామ్‌సంగ్‌ అన్ని స్మార్ట్‌ఫోన్లలో ‘పే’ యాప్‌ - Sakshi

సామ్‌సంగ్‌ అన్ని స్మార్ట్‌ఫోన్లలో ‘పే’ యాప్‌

సామ్‌సంగ్‌ అన్ని స్మార్ట్‌ఫోన్లలో ‘పే’ యాప్‌ను ప్రీ ఇన్‌స్టాల్‌ చేయనుంది. 2017 జనవరి నుంచి దీనిని అమలు చేయాలని నిర్ణయించింది.

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సామ్‌సంగ్‌ అన్ని స్మార్ట్‌ఫోన్లలో ‘పే’ యాప్‌ను ప్రీ ఇన్‌స్టాల్‌ చేయనుంది. 2017 జనవరి నుంచి దీనిని అమలు చేయాలని నిర్ణయించింది. గెలాక్సీ నోట్‌–5, గెలాక్సీ ఎస్‌6 ఎడ్జ్‌ ప్లస్‌ మోడళ్లతో పేయాప్‌ గతేడాది రంగ ప్రవేశం చేసింది. పే యాప్‌తో చెల్లింపుల కోసం కస్టమర్లు యాప్‌ను తెరిచి ఫింగర్‌ ప్రింట్‌ స్కాన్‌ చేయాలి. వర్తకుని వద్ద నగదు స్వీకరణ కోసం ఉన్న ప్రత్యేక టెర్మినల్‌కు సమీపంగా ఫోన్‌ను ఉంచగానేచెల్లింపులు పూర్తి అవుతాయి. ఇక సామ్‌సంగ్‌ పే మొబైల్‌ పేమెంట్‌ సేవలు ప్రస్తుతం యూఎస్, స్పెయిన్, బ్రెజిల్, సింగపూర్, ఆస్ట్రేలియా, చైనా, దక్షిణ కొరియాలో అందుబాటులో ఉన్నాయి.  కొద్ది రోజుల్లో భారత్‌లోనూఅడుగు పెట్టే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement