బడ్జెట్‌ ధరల్లో శాంసంగ్‌ గెలాక్సీ ఫోన్లు త్వరలో

Samsung Galaxy M10 and M20 prices revealed, will start at Rs 9,500 - Sakshi

అద్భుత ఫీచర్లు, బడ్జెట్‌ ధరలు

మిలియన్లమంది టార్గెట్‌గా ఎం సిరీస్‌ ఫోన్లు

షావోమికి షాకే : ధరలు రూ.10, రూ. 15వేల లోపే 

భారత్‌లోనే గ్లోబల్‌ లాంచ్‌

సౌత్‌ కొరియాఎలక్ట్రానిక్‌ దిగ్గజం శాంసంగ్‌ బడ్జెట్‌ ధరలో మొబైల్‌ ఫోన్లను తీసుకురానుంది. తద్వారా భారతీయస్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో నెంబర్‌ వన్‌ స్థానంలో పాగావేసిన చైనా స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ షావోమిని సవాల్‌ చేయనుంది. ఎం సిరీస్‌ గెలాక్స్‌ ఫోన్లపై  గత ఏడాది డిసెంబరులోనే న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ నివేదించడం గమనార్హం.

తక్కువ ధరలకే అద్భుతమైన ఫీచర్లతో సరికొత్తగా  గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లను తీసుకురావాలని శాంసంగ్‌ ప్రణాళికలు రచిస్తోంది. మధ్య స్థాయి ధరల శ్రేణిలో ‘శాంసంగ్‌ గెలాక్సీ ఎం’ (ఎం=మిలినియల్స్‌) సిరీస్‌లో ఫోన్లను లాంచ్‌ చేయనుంది. అంటే లక్షలమందిని కస‍్టమర్లను ఆకర్షించాలనేది ప్లాన్‌.

ముఖ్యంగా గెలాక్సీ ఎం సిరీస్‌లో ఎం10, ఎం20, ఎం30 పేరుతో మూడుస్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తేనుంది. ఇన్ఫినిటీ వినాచ్‌ డిస్‌ప్లేతో ఈ నెలలోనే వీటిని లాంచ్‌ చేయనుందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. 

ఎం10ను (6 అంగుళాల డిస్‌ప్లే) రూ.9500, ఎం20 (6.3 అంగుళాల డిస్‌ప్లే), ఎం30  ధరతో సుమారు రూ.12 నుంచి రూ.15వేల ధరకు తీసుకొచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఎం30 డివైస్‌లో ట్రిపుల్‌ కెమెరా మెయిన్‌ ఫీచర్‌గా ఉండనుందట.  భారత్‌లోనే గ్లోబల్‌ లాంచ్‌ కార్యక్రమాన్ని నిర్వహించనుండటం మరో విశేషం.

శాంసంగ్‌ సొంత ఎక్సినాస్ 7885 ప్రాసెసర్తో పాటు, 4జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 8.1ఓరియో, భారీ డిస్‌ప్లే, ఆకర్షణీయమైనకెమెరా, భారీబ్యాటరీతో  ఈ ఫోన్లు మార్కెట్లో త్వరలోనే హల్‌చల్‌ చేయనున్నాయి. వీటి ఫీచర్లపై అంచనాలు ఇలా ఉన్నాయి.

ఎం10 : 6 అంగుళాల డిస్‌ప్లే,  8 ఎంపీసెల్పీ కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌; 7870 ఆక్టాకోర్‌ ప్రాససర్‌, ఆండ్రాయిడ్‌ ఓరియో, 3జీబీ ర్యామ్‌, 16/32జీబీ స్టోరేజ్‌, 3400 ఎంఏహెచ్‌ బ్యాటరీ
ఎం 20 :  60.3 ఇంచెస్‌డిస్‌ప్లే, 3జీబీ ర్యామ్‌, 32జీబీ/64 స్టోరేజ్‌, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 13+5 డ్యుయల్‌ రియర్‌ కెమెరా, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ  
ఎం 30 : 6.3 ఇంచెస్‌డిస్‌ప్లే 4జీబీ  ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 16 ఎంపీ సెల్పీ కెమెరా, 13+5+5  ఎంపీ  ట్రిపుల్‌  రియర్‌ కెమెరా, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top