breaking news
M Series
-
శాంసంగ్ నుంచి కొత్త ఫోన్.. ధర తక్కువే..
శాంసంగ్ తన పాపులర్ గెలాక్సీ ఎం సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. సరికొత్త గెలాక్సీ ఎం36 5జీని విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ 5ఎన్ఎం ఎక్సినోస్ 1380 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది స్మూత్ గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం వేపర్ కూలింగ్ ఛాంబర్‌ను సపోర్ట్ చేస్తుంది.120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, విజన్ బూస్టర్ టెక్నాలజీతో స్లీక్, 7.7 ఎంఎం సన్నని బాడీ, 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోల్డ్ డిస్ప్లేను కలిగి ఉంది.గూగుల్‌తో సర్కిల్ టు సెర్చ్, జెమినీ లైవ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ + ప్రొటెక్షన్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్లు, సెగ్మెంట్-ఫస్ట్ ఆఫర్లు ఇందులో ఉన్నాయి.వెల్వెట్ బ్లాక్, సెరీన్ గ్రీన్, ఆరెంజ్ హేజ్ అనే మూడు రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది.షేక్ ఫ్రీ వీడియోలు, బ్లర్ ఫ్రీ ఫోటోల కోసం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తో కూడిన 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరాను ఇందులో అందించారు.ఫ్రంట్, రియర్ కెమెరాలలో 4కే వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇమేజ్ నాణ్యతను పెంచడానికి ఆటో నైట్ మోడ్, ఫోటో రీమాస్టర్, ఆబ్జెక్ట్ ఎరేజర్ వంటి ఫీచర్లతో వస్తుంది. ముందు భాగంలో స్పష్టమైన సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, సింగిల్ ఛార్జింగ్‌తో ఎక్కువ గంటలు వినోదం, ఉత్పాదకతను అందిస్తుంది. వేగవంతమైన డౌన్లోడ్, అంతరాయం లేని స్ట్రీమింగ్ కోసం డివైజ్ పూర్తి 5జీ కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది.ఈ ఫోన్ వన్ యుఐ 7 తో వెళుతుంది, ఇది మరింత క్రమబద్ధమైన డిజైన్, కస్టమైజబుల్ విడ్జెట్లు మరియు లాక్ స్క్రీన్‌లో రియల్-టైమ్ అప్డేట్ల కోసం నౌ బార్ అనే కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తుంది.ఆండ్రాయిడ్ ఓఎస్ ఆరు జనరేషన్ అప్‌గ్రేడ్ లు, ఆరేళ్ల సెక్యూరిటీ అప్ డేట్స్ కు శాంసంగ్ హామీ ఇస్తోంది. ఈ విభాగంలో కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేస్తోంది.గెలాక్సీ ఎం36 5జీ స్మార్ట్ ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.16,499గా, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.17,999గా, 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.20,999గానూ నిర్ణయించారు.గెలాక్సీ ఎం36 5జీ స్మార్ట్ ఫోన్లను జూలై 12 నుంచి శాంసంగ్, అమెజాన్ వెబ్సైట్లతోపాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో విక్రయించనున్నారు. -
శాంసంగ్ ఎం మొబైల్స్.. బడ్జెట్ ధరల్లో
సాక్షి, న్యూఢిల్లీ: శాంసంగ్ ఎం సిరీస్ గెలాక్సీ స్మార్ట్ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న గెలాక్సీ ఎం 10, గెలాక్సీ ఎం 20 స్మార్ట్ఫోన్లు సోమవారం అధికారంగా విడుదల య్యాయి. డ్యుయల్ కెమెరా సెటప్, ఇన్ఫినిటీ వి డిస్ప్లే తో వీటిని తీసుకొచ్చింది. ఫిబ్రవరి 5వ తేదీనుంచి ప్రత్యేకంగా అమెజాన్, శాంసంగ్ ఈ స్టోర్ ద్వారా ఈ డివైస్‌లు లభ్యం కానున్నాయి. గెలాక్సీ ఎం10ను రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది. 2జీబీ ర్యామ్/16జీబీ స్టోరేజ్ వెర్షన్ ధరను రూ.7990గా నిర్ణయించగా, 3జీబీ ర్యామ /32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.8990గా ఉంచింది. గెలాక్సీ ఎం 20 కూడా రెండు వెర్షన్లలొ అందుబాటులోకి తీసుకు వచ్చింది. 3జీబీ ర్యామ్/32జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర రూ.10,990గానూ, 4జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 12,990గా ఉంది. శాంసంగ్ గెలాక్స్ ఎం 10 ఫీచర్లు 6.2 అంగుళాల డిస్ప్లే 720x1520 పిక్సెల్స్ రిజల్యూషన్ ఎక్సినాస్ 7870 సాక్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 13+5 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్పీ కెమెరా 3400 ఎంఏహెచ్ బ్యాటరీ శాంసంగ్ గెలాక్సీ ఎం20 ఫీచర్లు 6.3 అంగుళాల డిస్ప్లే 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్ ఎక్సినాస్ 7904 సాక్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 13+5 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్పీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ లాంచింగ్ ఆఫర్ జియో ద్వారా ప్రత్యేక లాంచింగ్ ఆఫర్ కూడా ఉంది. రూ.198లకు జియె ప్యాక్‌పై డబుల్ డేటా ప్రయెజనాలను అందిస్తోంది. రోజుకు 4జీబీ డేటా చొప్పున 10 నెలలు పాటు ఉచితంగా అందించనుంది. ఈ ఆఫర్‌తో జియో వినియోగదారులకు రూ.3110ల అదనపు ప్రయోజనం లభించనుందని శాంసంగ్ వెల్లడించింది. -
వచ్చే నెల్లో శాంసంగ్ ‘గెలాక్సీ ఎం సిరీస్’ విడుదల..!
న్యూఢిల్లీ: చైనాకు చెందిన దిగ్గజ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ షావోమికి పోటీగా.. కొరియా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ అతి త్వరలోనే ‘గెలాక్సీ ఎం సిరీస్’ను భారత్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. రెండంకల వృద్ధి రేటును సాధించడంలో భాగంగా తొలుత ఈఫోన్ సిరీస్‌ను భారత్‌లోనే విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్స్ ధరలు రూ.20,000 వరకు ఉండనున్నట్లు శాంసంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అసిమ్ వార్సీ మీడియాతో అన్నారు. ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ.. ‘ఈనెల తరువాత స్మార్ట్ఫోన్లను విడుదల చేయాలని భావిస్తున్నాం. శాంసంగ్, అమేజాన్ వెబ్సైట్లలో వీటిని అందించనున్నాం. ఎం సిరీస్ విడుదల ద్వారా 2019లో రెండంకెల వృద్ధి రేటును లక్ష్యంగా నిర్థేశించుకున్నాం. కేవలం డివైజ్‌ల పరంగానే కాకుండగా.. ఫ్యాక్టరీ, ఎక్సిపీరియన్స్ సెంటర్ల విస్తరణపై కూడా దృష్టి సారించాం. భారత మార్కెట్‌కు అవసరాలకు తగిన విధంగా సేవలందించడమే మా సంస్థ ధ్యేయం.’ అని వివరించారు. -
బడ్జెట్ ధరల్లో శాంసంగ్ గెలాక్సీ ఫోన్లు త్వరలో
సౌత్ కొరియాఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ బడ్జెట్ ధరలో మొబైల్ ఫోన్లను తీసుకురానుంది. తద్వారా భారతీయస్మార్ట్‌ఫోన్ మార్కెట్లో నెంబర్ వన్ స్థానంలో పాగావేసిన చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమిని సవాల్ చేయనుంది. ఎం సిరీస్ గెలాక్స్ ఫోన్లపై గత ఏడాది డిసెంబరులోనే న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ నివేదించడం గమనార్హం. తక్కువ ధరలకే అద్భుతమైన ఫీచర్లతో సరికొత్తగా గెలాక్సీ స్మార్ట్ఫోన్లను తీసుకురావాలని శాంసంగ్ ప్రణాళికలు రచిస్తోంది. మధ్య స్థాయి ధరల శ్రేణిలో ‘శాంసంగ్ గెలాక్సీ ఎం’ (ఎం=మిలినియల్స్) సిరీస్‌లో ఫోన్లను లాంచ్ చేయనుంది. అంటే లక్షలమందిని కస్టమర్లను ఆకర్షించాలనేది ప్లాన్. ముఖ్యంగా గెలాక్సీ ఎం సిరీస్‌లో ఎం10, ఎం20, ఎం30 పేరుతో మూడుస్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తేనుంది. ఇన్ఫినిటీ వినాచ్ డిస్ప్లేతో ఈ నెలలోనే వీటిని లాంచ్ చేయనుందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఎం10ను (6 అంగుళాల డిస్ప్లే) రూ.9500, ఎం20 (6.3 అంగుళాల డిస్ప్లే), ఎం30 ధరతో సుమారు రూ.12 నుంచి రూ.15వేల ధరకు తీసుకొచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఎం30 డివైస్‌లో ట్రిపుల్ కెమెరా మెయిన్ ఫీచర్‌గా ఉండనుందట. భారత్‌లోనే గ్లోబల్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించనుండటం మరో విశేషం. శాంసంగ్ సొంత ఎక్సినాస్ 7885 ప్రాసెసర్‌తో పాటు, 4జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 8.1ఓరియో, భారీ డిస్ప్లే, ఆకర్షణీయమైనకెమెరా, భారీబ్యాటరీతో ఈ ఫోన్లు మార్కెట్లో త్వరలోనే హల్చల్ చేయనున్నాయి. వీటి ఫీచర్లపై అంచనాలు ఇలా ఉన్నాయి. ఎం10 : 6 అంగుళాల డిస్ప్లే, 8 ఎంపీసెల్పీ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్; 7870 ఆక్టాకోర్ ప్రాససర్, ఆండ్రాయిడ్ ఓరియో, 3జీబీ ర్యామ్, 16/32జీబీ స్టోరేజ్, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ ఎం 20 : 60.3 ఇంచెస్‌డిస్‌ప్లే, 3జీబీ ర్యామ్, 32జీబీ/64 స్టోరేజ్, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 13+5 డ్యుయల్ రియర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఎం 30 : 6.3 ఇంచెస్‌డిస్‌ప్లే 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 16 ఎంపీ సెల్పీ కెమెరా, 13+5+5 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ -
జియోనీ నుంచి ‘ఎం6’, ‘ఎం6 ప్లస్’ స్మార్ట్‌ఫోన్స్
బీజింగ్: చైనా స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ ‘జియోనీ’ తాజాగా తన మారథన్ (ఎం) సిరీస్‌లోనే ‘ఎం6’, ‘ఎం6 ప్లస్’ అనే రెండు స్మార్ట్ఫోన్లను చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. వీటి ప్రారంభ ధర రూ.27,200గా ఉంటుందని అంచనా. ‘ఎం6’ స్మార్ట్‌ఫోన్‌లో ఫ్రంట్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ప్రైవసీ ప్రొటక్షన్, మాల్వేర్ డిస్ట్రక్షన్ వంటి ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. అలాగే ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 5.5 అంగుళాల హెచ్డీ స్క్రీన్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ, ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్, 13 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలు ఉన్నాయని వివరించింది. ఇక ‘ఎం6 ప్లస్’లో 6 అంగుళాల హెచ్డీ స్క్రీన్, 6,020 ఎంఏహెచ్ బ్యాటరీ, 16 ఎంపీ రియర్ కెమెరా ప్రత్యేకతలు ఉన్నట్లు తెలిపింది.