ఇండిపెండెన్స్‌ డే సేల్‌ : స్మార్ట్‌ఫోన్లపై స్పెషల్‌ ఆఫర్లు

Samsung Announces Independence Day sale - Sakshi

దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం శాంసంగ్‌ ఇండిపెండెన్స్‌ డే సేల్‌ను ప్రకటించింది. ఇండిపెండెన్స్‌ డేకి ముందుగా ఈ సేల్‌ను నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై స్పెషల్‌ ఆఫర్లు అందిస్తున్నట్టు పేర్కొంది. శాంసంగ్‌ ఇండిపెండెన్స్‌ డే సేల్‌ కింద టీవీలు, అప్లియెన్స్‌, వేరబుల్స్‌, ఆడియో యాక్ససరీస్‌పై కూడా  డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, ఇతర ఆఫర్లను ఆఫర్‌ చేస్తున్నట్టు తెలిపింది.  ఆగస్టు 1 నుంచి మొదలైన ఈ సేల్‌ ఆగస్టు 5 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో భాగంగా శాంసంగ్‌, పేటీఎం నుంచి ప్రొడక్ట్‌లు కొనుగోలు చేసే కస్టమర్లకు 5 శాతం క్యాష్‌బ్యాక్‌ ఇస్తోంది.

గెలాక్సీ ఎస్‌9 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ శాంసంగ్‌ షాపులో 4 వేల రూపాయల తగ్గింపులో రూ.64,990కు అందుబాటులో ఉంది. అదనంగా గెలాక్సీ ఎస్‌9ప్లస్‌ కస్టమర్లకు రూ.3000 ఇన్‌స్టాంట్ క్యాష్‌బ్యాక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులపై రూ.6000 క్యాష్‌బ్యాక్‌ అందిస్తోంది. ఎయిర్‌టెల్‌, జియో, వొడాఫోన్‌ కంపెనీలు కూడా ఆఫర్లను అందిస్తున్నాయి. ఎంపిక చేసిన మొబైల్స్‌పై అదనంగా రూ.6000 ఎక్స్చేంజ్‌ వాల్యు అందుబాటులో ఉంది. శాంసంగ్‌ ఇండిపెండెన్స్‌ డే సేల్‌లో గెలాక్సీ ఎస్‌9 స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.57,900 నుంచి ప్రారంభమవుతుంది. ధరల్లో ఎలాంటి మార్పు లేనప్పటికీ, ఈ స్మార్ట్‌ఫోన్‌ 128జీబీ, 256జీబీ వేరియంట్‌పై రూ.6000 ఇన్‌స్టాంట్‌ క్యాష్‌బ్యాక్‌, 64జీబీ మోడల్‌పై రూ.5000 క్యాష్‌బ్యాక్‌ను ఇస్తోంది. అదనంగా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డుదారులకు రూ.6000 క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్‌ చేస్తోంది.

ఎయిర్‌టెల్‌, జియో, వొడాఫోన్‌ కంపెనీలు కూడా గెలాక్సీ ఎస్‌9పై ఆఫర్లను అందిస్తున్నాయి. గెలాక్సీ ఆన్‌ మ్యాక్స్‌, గెలాక్సీ ఆన్‌7 ప్రైమ్‌(64జీబీ వేరియంట్‌), గెలాక్సీ ఆన్‌ నెక్ట్స్‌(64జీబీ వేరియంట్‌), గెలాక్సీ ఆన్‌7 ప్రొ, గెలాక్సీ జే3 ప్రొ, గెలాక్సీ ఆన్‌5 ప్రొ, గెలాక్సీ ఆన్‌5లు ఆఫర్లలో అందుబాటులో ఉన్నాయి. మిగతా అన్ని స్మార్ట్‌ఫోన్లపై కూడా డిస్కౌంట్‌ ధరలను శాంసంగ్‌ ఆఫర్‌ చేస్తోంది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top