కోలుకున్న రూపాయి

The rupee recovered - Sakshi

30 పైసలు బలపడి రూ.68.08కి చేరిక

ముంబై: డాలర్‌కు అమ్మకాల ఒత్తిడి ఎదురు కావడంతో రూపాయి పుంజుకుంది. ఫారెక్స్‌ మార్కెట్లో బుధవారం 30 పైసలు బలపడి 68.08 వద్ద క్లోజయింది. బ్యాంకులు, ఎగుమతిదారులు డాలర్ల విక్రయాలకు మొగ్గుచూపారు. అదే సమయంలో దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్‌ తగ్గడంతో రూపాయి కోలుకోవడానికి దోహదపడింది.

యూరో, పౌండ్, యెన్‌లతోనూ రూపాయి బలపడడం గమనార్హం. మంగళవారం నెల రోజుల కనిష్ట స్థాయి 68.38వద్ద క్లోజ్‌ అయిన విషయం తెలిసిందే. ఇక ఆసియా కరెన్సీలు చాలా వరకు రికవరీ అయ్యాయి.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top