ఈ కార్ల ధరకు రెక్కలు | Renault to hike prices of Kwid, Duster, Lodgy | Sakshi
Sakshi News home page

ఈ కార్ల ధరకు రెక్కలు

Dec 15 2017 6:42 PM | Updated on Dec 15 2017 6:42 PM

Renault to hike prices of Kwid, Duster, Lodgy - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: కొత్త ఏడాది కార్ల ధరలను పెంచనున్నట్టు పలు వాహన కంపెనీలు ప్రకటించగా, తాజాగా ఫ్రెంచ్‌ కార్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీ రెనాల్ట్‌ తమ కార్లు క్విడ్‌, డస్టర్‌, లాడ్జీ వెరైటీలను మూడు శాతం మేర పెంచనున్నట్టు ప్రకటించింది. జనవరి 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని తెలిపింది.

ముడిపదార్ధాల ధరలు పెరగడంతోనే వాహన ధరల పెంపు అనివార్యమైందని రెనాల్ట్‌ పేర్కొంది. అయితే ఇటీవల మార్కెట్‌లో ప్రవేశపెట్టిన ప్రీమియం ఎస్‌యూవీ క్యాప్చర్‌ ధరలు మాత్రం యథాతథంగా ఉంటాయని స్పష్టం చేసింది.

మహీంద్ర అండ్‌ మహీంద్ర, వోక్స్‌వ్యాగన్‌లు భారత్‌లో తమ వాహన ధరలను పెంచుతున్నట్టు గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. పాసింజర్‌, కమర్షియల్‌ వాహనాల ధరలను మూడు శాతం పెంచుతున్నట్టు మహీంద్ర వెల్లడించగా, తమ వాహన ధరలను రూ 20,000 వరకూ పెంచనున్నట్టు వోక్స్‌వ్యాగన్‌ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement