రిలయన్స్ స్మార్ట్ కొత్త స్టోర్.. అన్ని వస్తువులపై | Reliance New Smart Super Store Start In Bandlaguda | Sakshi
Sakshi News home page

రిలయన్స్ స్మార్ట్ నూత‌న స్టోర్ ప్రారంభం

Feb 28 2020 4:53 PM | Updated on Feb 28 2020 7:40 PM

Reliance New Smart Super Store Start In Bandlaguda - Sakshi

సాక్షి, హైదరాబాద్:  రిలయన్స్ రిటైల్‌కు చెందిన భారీ స్థాయి సూప‌ర్ మార్కెట్ శ్రేణి అయిన రిలయన్స్ స్మార్ట్ త‌న కొత్త స్టోర్‌ను శుక్రవారం బండ్లగూడా ప్రాంతంలోని హెచ్‌పీ పెంట్రోల్ బంక్ దగ్గర ప్రారంభించింది. ఒకే కేంద్రంలో అనేక రకాల ఉత్ప‌త్తులను క‌లిగి ఉండే ఈ స్టోర్‌లో కిరాణ ఉత్ప‌త్తులు, పండ్లు, కూర‌గాయ‌లు, పాల ఉత్ప‌త్తులు, కిచెన్‌వేర్‌, హోంవేర్ వంటి వాటితో పాటు మరెన్నో ఉత్ప‌త్తులు అందుబాటులో ఉన్నాయి. తాజాగా ప్రారంభమైన బండ్లగూడా స్టోర్‌ క‌లుపుకొని తెలంగాణ రాష్ట్రంలో రిలయన్స్ స్మార్ట్ స్టోర్ల సంఖ్య 23 కు చేరుకుంది.

నాణ్య‌మైన ఉత్ప‌త్తులు మ‌రియు ఆక‌ర్ష‌ణీయ‌మైన ధ‌ర‌ల వ‌ల్ల స్థానిక ప్ర‌జ‌ల హృద‌యాల‌ను గెలుచుకోవ‌డంతో పాటుగా వారి రోజువారీ అవ‌స‌రాల‌ను తీర్చే కేంద్రంగా రిలయన్స్ స్మార్ట్ నిల‌వ‌నుంది. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా, వినియోగ‌దారుడిపై ప్ర‌త్యేక దృష్టి సారించిన రిలయన్స్ స్మార్ట్.. వినియోగ‌దారుల‌కు అత్యుత్త‌మ షాపింగ్ అనుభూతిని అందిస్తోంది. లార్జ్ ఫార్మాట్ సూప‌ర్ మార్కెట్ కేట‌గిరీలో విస్తృత శ్రేణిలో ఉత్ప‌త్తులు వినియోగ‌దారుల‌కు అందిస్తూ.. స్థ‌లం ప‌రంగా కూడా సారుప్యంగా అందుబాటులో ఉంది.

రిలయన్స్ స్మార్ట్ స్టోర్‌ ప్రత్యేకతలు
రిలయన్స్ స్మార్ట్ వినియోగ‌దారులు చెల్లించే మొత్తానికి త‌గిన నాణ్య‌మైన ఉత్పత్తులు అందించ‌డంతో పాటుగా ఎంఆర్‌పీపై క‌నీసం 5% డిస్కౌంట్‌ను అన్ని ఉత్ప‌త్తుల‌పై సంవత్సరం పొడ‌వునా అందిస్తోంది. దీంతోపాటుగా రూ.1499 విలువ గ‌ల కొనుగోలు చేసిన‌ప్పుడు కిలో పంచ‌దార‌ను రూ.9 క‌నీస ధ‌ర‌తో అందించ‌డం వంటి ఆక‌ర్ష‌ణీయ ప‌థ‌కాల వ‌ల్ల దేశ‌వ్యాప్తంగా తమ నెల‌వారి కిరాణ స‌రుకుల కోసం ఎంచుకోద‌గిన ఉత్త‌మ‌మైన సూప‌ర్‌మార్కెట్‌గా రిలయన్స్ స్మార్ట్ నిలుస్తోంది. వీట‌న్నింటితో పాటుగా, ప్ర‌ధాన‌మైన ఉత్ప‌త్తులను, పండ్లు మ‌రియు కాయ‌గూర‌ల‌పై ప్ర‌తిరోజూ త‌క్కువ ధ‌ర‌లకే అందిస్తోంది. అయితే ఈ సేవలు హైదరాబాద్‌లోని స్టోర్‌లలో మాత్రమే లభిస్తాయి.

1
1/2

2
2/2

Advertisement
 
Advertisement
Advertisement