'జియో క్రికెట్ ఫెస్టివల్‌': బంపర్‌ ఆఫర్లు | Reliance Jio Cricket Festival announced with new data pack, games, prizes and comedy show | Sakshi
Sakshi News home page

'జియో క్రికెట్ ఫెస్టివల్‌': బంపర్‌ ఆఫర్లు

Apr 4 2018 8:23 PM | Updated on Oct 1 2018 6:33 PM

Reliance Jio Cricket Festival announced with new data pack, games, prizes and comedy show - Sakshi

రిలయన్స్‌ జియో( ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్:  భారత్ యావత్తూ ఐపిఎల్ క్రికెట్ పండగ కోసం సిద్ధమవుతుండగా, జియో మరోసారి ఆసక్తికరమైన వినోదాన్ని తన కస్టమర్లకు పంచేందుకు ముందుకు వచ్చింది. క్రికెట్, కామెడీ మేళవించిన రెండు వినోద కార్యక్రమాలను విడుదల చేసింది.  ‘జియో ధన్ ధనా ధన్ లైవ్’ 'జియో క్రికెట్ ప్లే అలాంగ్' , అనే కొత్త  పథకాలను లాంచ్‌  చేసింది.  దీంతోపాటు ‘జియో క్రికెట్ సీజన్ ప్యాక్’  అనే కొత్త రీచార్జ్‌ పథకాన్ని కూడా అందుబాటులోకి తెస్తోంది.

జియో క్రికెట్ ప్లే అలాంగ్:  జియో క్రికెట్ ప్లే అలాంగ్ పేరుతో ఆవిష్కరించిన లైవ్ మొబైల్ గేమ్ షో ద్వారా వినియోగదార్లు క్రికెట్‌ను ఆస్వాదించడంతో పాటు కోట్లాది రూపాయల విలువ చేసే బహుమతులను గెలుచుకునే అవకాశం ఉంది.  మొత్తం 11 భారతీయ భాషల్లో అందుబాటులో ఉండే ఈ మొబైల్ గేమ్  షో లో 25 కార్లను గెల్చుకునే అవకాశం. 7 వారాలు, 60 మ్యాచ్‌ల వరకు ఈ గేమ్ షో వినోదాన్ని పొందవచ్చు.

‘జియో ధన్ ధనా ధన్ లైవ్’: ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు క్రికెట్ తో పాటు స్వేచ్ఛమైన వినోదాన్ని అందించేందుకు జియో ప్రయత్నిస్తోంది.  ఈ  షో ఏప్రిల్ 7న ‘ మై జియో’  యాప్ లో అందుబాటులోకి వస్తుంది. జియో కస్టమర్లతో పాటు జియో యేతర కస్టమర్లు కూడా ఈ షోను  ఉచితంగా వీక్షించవచ్చు. భారతదేశపు ప్రముఖ కమెడియన్ సునీల్ గ్రోవర్, ప్రఖ్యాత స్పోర్ట్స్ యాంకర్ సమీర్ కొచ్చర్ కామెడీ షో ను సంయుక్తంగా నిర్వహిస్తారు.  ఇంకా శిల్పా షిండే, అలీ అస్గర్, సుగంధ మిశ్రా, సురేష్ మీనన్, పరేష్ గణత్ర,  శివాని దండేకర్ ,  అర్చన విజయ్ కూడా  ఈ షోలో పాల్గొంటారు. అంతేకాదు క్రికెట్‌ లెజెండ్స్ కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్‌ను చూసే అవకాశం.

జియో క్రికెట్ సీజన్ ప్యాక్: క్రికెట్ పండుగను దృష్టిలో ఉంచుకుని జియో సరికొత్త రీఛార్జి ప్యాక్ ను ప్రవేశపెట్టింది. ‘జియో క్రికెట్ సీజన్ ప్యాక్’ పేరుతో అందించనున్న ఈ ప్యాక్ ద్వారా రూ. 251 చెల్లించి 51 రోజులకు 102 జీబీ 4జీ డేటాను పొందే వీలుంది. ఈ కొత్త రీఛార్జి ప్యాక్ ద్వారా ప్రేక్షకులు తమకిష్టమైన ఐపిఎల్ మ్యాచ్ లను ‘జియో టీవీ’  యాప్ ద్వారా వీక్షించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement