జూలైలో తగ్గిన తయారీ | Reduced production In July | Sakshi
Sakshi News home page

జూలైలో తగ్గిన తయారీ

Jul 21 2015 1:49 AM | Updated on Sep 3 2017 5:51 AM

దేశీ తయారీ రంగం వృద్ధి జులైలో మందగించింది...

న్యూఢిల్లీ: దేశీ తయారీ రంగం వృద్ధి జులైలో మందగించింది. ఎస్‌బీఐ నిర్వహించే కాంపోజిట్ ఇండెక్స్ ప్రకారం గత జులైతో పోలిస్తే ఈసారి తయారీ రంగ కార్యకలాపాల వృద్ధి 53.2 నుంచి 49.7కి తగ్గింది. అదే నెలలవారీగా చూసినప్పుడు ఈ ఏడాది జూన్‌తో పోలిస్తే 47.0 నుంచి 46.7కి క్షీణించింది. రుణాల మంజూరు అంతగా లేకపోతుండటం క్రమంగా తయారీ రంగంపై ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోందని, పారిశ్రామికోత్పత్తి వృద్ధి మందగించడానికి ఇది దారి తీస్తోందని ఎస్‌బీఐ ఒక అధ్యయన నివేదికలో పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement