తొలి సేల్‌కు ముందే 10 లక్షల రిజిస్ట్రేషన్లు | Redmi 5A gets over 1 million registrations before first sale: Xiaomi | Sakshi
Sakshi News home page

తొలి సేల్‌కు ముందే 10 లక్షల రిజిస్ట్రేషన్లు

Dec 6 2017 7:49 PM | Updated on Dec 6 2017 7:49 PM

Redmi 5A gets over 1 million registrations before first sale: Xiaomi - Sakshi

'దేశ్‌ కా స్మార్ట్‌ఫోన్‌'గా షావోమి ఇటీవల ప్రవేశపెట్టిన రెడ్‌మి 5ఏ స్మార్ట్‌ఫోన్‌కు అనూహ్య స్పందన వస్తోంది. తొలి సేల్‌కు ముందే ఈ స్మార్ట్‌ఫోన్‌ 10 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లను పొందింది. ఎంఐ.కామ్‌, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ రిజిస్ట్రేషన్ల వెల్లువ కొనసాగింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ రేపటి(డిసెంబర్‌ 7) నుంచి తొలిసారి విక్రయానికి వస్తోంది. రెండు వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయింది. 2జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.4,999కాగ, 3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 6,999 రూపాయలు. 

అయితే బేస్‌ మోడల్‌ ధర 5999 రూపాయలు. వెయ్యి రూపాయల డిస్కౌంట్‌తో బేస్‌ మోడల్‌ను రూ.4,999కే విక్రయిస్తుంది. ''1 మిలియన్‌ మార్కును పొందాం. ఇంకా కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ.కామ్‌లలో తొలిసారి విక్రయానికి వస్తున్న రెడ్‌మి 5ఏకు 1 మిలియన్‌కు పైగా రిజిస్ట్రేషన్లు పొందాం. యే హాయ్‌#దేశ్‌ కా స్మార్ట్‌ఫోన్‌'' అని షావోమి ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ మను కుమార్‌ జైన్‌ తెలిపారు. ఏ  డార్క్‌ గ్రే, గోల్డ్‌, రోజ్‌ గోల్గ్‌ కలర్‌ వేరియంట్స్‌లో ఇది లభ్యం.

రెడ్‌మి 5ఏ ఫీచర్లు
5 అంగుళాల హెచ్‌డీ తాకే తెర
స్నాప్‌డ్రాగన్‌ 425 ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్‌ నోగట్‌, ఎంఐయూఐ 9 వెర్షన్‌
2జీబీ ర్యామ్‌, 3జీబీ ర్యామ్‌
16జీబీ, 32జీబీ  స్టోరేజ్‌
128జీబీ వరకు  విస్తరించుకునే అవకాశం  
13 ఎంపీ రియర్‌ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
3000ఎంఏహెచ్‌ బ్యాటరీ

Advertisement
 
Advertisement
Advertisement