బ్యాంకు ఖాతాదారులకు తీపికబురు | RBI To Impose Penalty For Keeping ATMs Dry | Sakshi
Sakshi News home page

బ్యాంకు ఖాతాదారులకు తీపికబురు

Jun 14 2019 4:16 PM | Updated on Jun 15 2019 8:05 AM

RBI To Impose Penalty For Keeping ATMs Dry - Sakshi

ఏటీఎంల్లో నగదు కష్టాలకు చెక్‌

సాక్షి, న్యూఢిల్లీ : నగదు కోసం ఏటీఎంల చుట్టూ తిరిగి ఉసూరుమనే ఖాతాదారులకు ఆర్‌బీఐ ఊరట కల్పించింది. రోజుల తరబడి నగదు నింపకుండా ఏటీఎంలను ఖాళీగా ఉంచే బ్యాంకులు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఆర్‌బీఐ బ్యాంకులకు స్పష్టం చేసింది. మూడు గంటలకు మించి ఏటీఎంలు నగదు లేకుండా ఉండరాదని, అలా ఉంచిన బ్యాంకుల నుంచి జరిమానా వసూలు చేస్తామని, ప్రాంతాన్ని బట్టి జరిమానా విధిస్తామని ఆర్‌బీఐ పేర్కొంది.

చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఏటీఎంల్లో నగదు లేకపోవడంతో గంటల కొద్దీ ఖాతాదారులు వేచిచూడాల్సిన దుస్థితి నెలకొంది. మరికొన్ని చోట్ల ఏటీఎంల్లో రోజుల తరబడి నగదు నింపకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏటీఎంల్లో నెలకొల్పే సెన్సర్ల ద్వారా వాటిలో ఎం‍త నగదు ఉందనేది ఆయా బ్యాంక్‌లకు సమాచారం ఉంటుంది. నగదు లేని ఏటీఎంల గురించి పూర్తి సమాచారం ఉన్నా సకాలంలో నగదును నింపేందుకు బ్యాంకులు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో ఏటీఎంలు నిత్యం నగదుతో ఖాతాదారులకు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement