ఇప్పటికీ జియోనే చౌక.. | Rates Still Cheapest Compare To Other Networks Says By Jio | Sakshi
Sakshi News home page

ఇప్పటికీ జియోనే చౌక..

Dec 8 2019 6:52 PM | Updated on Dec 8 2019 6:54 PM

Rates Still Cheapest Compare To Other Networks Says By Jio - Sakshi

ముంబై: వినియోగదారుడికి సేవల విషయంలో ఇప్పటికీ జియోనే చౌక అని సంస్థ పేర్కొంది. ఇతర టెలికాం కంపెనీల ప్లాన్‌లతో పోల్చినప్పుడు తమ ప్లాన్‌లే చౌక అని వెల్లడించింది. ఇతర నెట్‌వర్కలకు చేసే కాల్స్‌ విషయంలో విధించిన పరిమితిని వినియాగదారులకు వివరించే ప్రయత్నం చేసింది. వినియోగదారుడి అవసరాలకు అనుగుణంగానే 5రేట్లు ఎక్కువగా అందిస్తున్నామని జియో సంస్థ వెల్లడించింది. ఇతర నెట్‌వర్క్‌లతో పోలిస్తే వినియాగదారులకు 25శాతం అదనపు సేవలను అందిస్తున్నామని తెలిపింది. జియా తాజాగా ప్రవేశపెట్టిన ప్లాన్‌లు వినియోగదారులకు చాలా సౌకర్యవంతంగా ఉన్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి.

వేరే నెట్‌వర్క్‌లకు కాల్స్‌ విషయంలో 28రోజులకు వెయ్యి నిముషాలు, 84రోజులకు 3 వేల నిమిషాలు అందిస్తున్నామని కంపెనీ పేర్కొంది. కాగా టెలికాం దిగ్గజాలు జియోకు 355మిలీయన్ల వినియోగదారులు ఉండగా, వొడాఫోన్‌ ఐడియాకు 311మిలీయన్ల వినియోగదారులు, ఎయిర్‌టెల్‌కు 280మిలియన్ల వినియోగదారులకు సేవలు అందిస్తున్న విషయం విదితమే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement