వచ్చే నెల 6 నుంచి రేడియో సిటీ ఎంబీఎల్‌ ఐపీఓ | Radio City FM operator's Rs 400 cr IPO to open on March 6 | Sakshi
Sakshi News home page

వచ్చే నెల 6 నుంచి రేడియో సిటీ ఎంబీఎల్‌ ఐపీఓ

Feb 25 2017 2:58 AM | Updated on Sep 5 2017 4:30 AM

వచ్చే నెల 6 నుంచి రేడియో సిటీ ఎంబీఎల్‌ ఐపీఓ

వచ్చే నెల 6 నుంచి రేడియో సిటీ ఎంబీఎల్‌ ఐపీఓ

మ్యూజిక్‌ బ్రాడ్‌కాస్ట్‌ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) వచ్చే నెల 6న ప్రారంభం కానున్నది.

కనీస రూ.400 కోట్ల సమీకరణ
ఇష్యూ ధర రూ.324–333 !


న్యూఢిల్లీ: మ్యూజిక్‌ బ్రాడ్‌కాస్ట్‌ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌  ఆఫర్‌) వచ్చే నెల 6న ప్రారంభం కానున్నది. జాగ్రణ్‌ ప్రకాశన్‌ గ్రూప్‌కు చెందిన ఈ సంస్థ రేడియో సిటీ ఎఫ్‌ఎం చానల్‌ను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 37 నగరాల్లో రేడియో సిటీ బ్రాండ్‌ కింద ఎఫ్‌ఎం  ప్రసారాలను ప్రసారం చేస్తోంది. ఈ ఐపీఓ ద్వారా రూ.400 కోట్లకు మించి నిధులను సమీకరించనున్నది. ఈ నెల 8న ముగిసే ఈ ఐపీఓలో భాగంగా రూ.400 కోట్ల విలువైన తాజా షేర్లతో పాటు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) విధానంలో 26.59 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేస్తామని మ్యూజిక్‌ బ్రాడ్‌కాస్ట్‌(ఎంబీఎల్‌) తెలిపింది.

ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను లిస్టెడ్‌ నాన్‌–కన్వర్టబుల్‌ డెబెంచర్ల ఉపసంహరణకు వినియోగిస్తామని వివరించింది.  ఎంబీఎల్‌ షేర్లు మార్చి 17న లిస్ట్‌ అయ్యే అవకాశాలున్నాయి. ఈ ఐపీఓ ధరల శ్రేణి రూ.324–333 రేంజ్‌లో, మార్కెట్‌ లాట్‌ 45 షేర్లుగా  ఉండొచ్చని సమాచారం. కాగా గత ఏడాది సెప్టెంబర్‌ 30తో ముగిసిన కాలానికి ఎంబీఎల్‌ రూ.138 కోట్ల ఆదాయాన్ని, రూ.30 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

Advertisement
 
Advertisement
Advertisement