పెరిగిన వంట గ్యాస్‌ ధర | Price Hike To Be Implemented For LPG Domestic Gas Cylinders | Sakshi
Sakshi News home page

పెరిగిన వంట గ్యాస్‌ ధర

Jun 3 2019 1:55 PM | Updated on Jul 6 2019 3:18 PM

Price Hike To Be Implemented For LPG Domestic Gas Cylinders - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  కేంద్రంలో బీజేపీ  సర్కార్‌ రెండవ సారి కొలువుదీరిన  తరువాత వరుసగా ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో వంట  గ్యాస్‌ సిలిండర్‌ ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. సవరించిన ధరలు జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. 

నెలవారీ ధరల సవరింపులో భాగంగా ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐవోసీ) 14.2 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరపై రూ.1.23 పైసలు పెంచింది.  అలాగే నాన్‌ సబ్సీడీ సిలిండర్‌ ధరను రూ. 25 పెంచింది. 

అయితే విమానాల్లో ఉపయోగించే ఏటీఎఫ్ ధరను ప్రభుత్వం తగ్గించింది. సబ్సిడీ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.1.23 పైసలు పెరిగింది. రాయితీలేని సిలిండర్ ధర రూ.25 పెరిగింది. సబ్సిడీదారులు సిలిండర్ ధరను చెల్లించిన తర్వాత సబ్సిడీ అమౌంట్ వారి అకౌంట్లో జమ అవుతాయి.  కాగా ఎల్‌పీజీ ధర పెరగడం వరుసగా ఇది నాలుగోసారి.

Advertisement
 
Advertisement
Advertisement