‘పెన్నార్‌’ విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం

Pennar Industries gets NCLT nod for merger - Sakshi

హైదరాబాద్‌: పెన్నార్‌ ఇండస్ట్రీస్‌లో పెన్నార్‌అనుబంధ కంపెనీల విలీనానికి నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) ఆమోదం లభించింది. పెన్నార్‌ ఇంజినీర్డ్‌ బిల్డింగ్‌ సిస్టమ్స్‌(పెబ్స్‌), పెన్నార్‌ ఎన్విరో లిమిటెడ్‌లు పెన్నార్‌ ఇండస్ట్రీస్‌లో విలీనమవుతాయి. విలీన స్కీమ్‌ ప్రకారం, ప్రతి 13 పెబ్స్‌ షేర్లకు 23 పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు లభిస్తాయి. అలాగే ప్రతి ఒక్క పెన్నార్‌ ఎన్విరో షేర్‌కు ఒక పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ లభిస్తుంది. విలీన స్కీమ్‌కు అప్పాయింటెడ్‌ డేట్‌ను గత ఏడాది ఏప్రిల్‌ 1గా ఎన్‌సీఎల్‌టీ ఆమోదించింది.

వాటాదారులకు కొత్త షేర్లు రావడానికి 2–3 నెలల సమయం పడుతుందని అంచనా.  విలీనం కారణంగా వ్యయాలు కలసివస్తాయని, నిధుల వినియోగం మెరుగుపడుతుందని కంపెనీ వైస్‌–ప్రెసిడెంట్‌ (కార్పొరేట్‌ స్ట్రాటజీ) కె.ఎమ్‌. సునీల్‌ పేర్కొన్నారు. త్వరలో రికార్డ్‌ డేట్‌ను ప్రకటిస్తామని వెల్లడించారు.  అనుబంధ కంపెనీల విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం లభించిన నేపథ్యంలో పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ 1.7 శాతం నష్టంతో రూ.31.35 వద్ద ముగిసింది. పెబ్స్‌ షేర్‌ 4.4 శాతం నష్టంతో రూ. 52.15వద్దకు చేరింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top