breaking news
Pennar Engineered Building Systems
-
‘పెన్నార్’ విలీనానికి ఎన్సీఎల్టీ ఆమోదం
హైదరాబాద్: పెన్నార్ ఇండస్ట్రీస్‌లో పెన్నార్‌అనుబంధ కంపెనీల విలీనానికి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్సీఎల్టీ) ఆమోదం లభించింది. పెన్నార్ ఇంజినీర్డ్ బిల్డింగ్ సిస్టమ్స్(పెబ్స్), పెన్నార్ ఎన్విరో లిమిటెడ్‌లు పెన్నార్ ఇండస్ట్రీస్‌లో విలీనమవుతాయి. విలీన స్కీమ్ ప్రకారం, ప్రతి 13 పెబ్స్ షేర్లకు 23 పెన్నార్ ఇండస్ట్రీస్ షేర్లు లభిస్తాయి. అలాగే ప్రతి ఒక్క పెన్నార్ ఎన్విరో షేర్‌కు ఒక పెన్నార్ ఇండస్ట్రీస్ షేర్ లభిస్తుంది. విలీన స్కీమ్‌కు అప్పాయింటెడ్ డేట్‌ను గత ఏడాది ఏప్రిల్ 1గా ఎన్సీఎల్టీ ఆమోదించింది. వాటాదారులకు కొత్త షేర్లు రావడానికి 2–3 నెలల సమయం పడుతుందని అంచనా. విలీనం కారణంగా వ్యయాలు కలసివస్తాయని, నిధుల వినియోగం మెరుగుపడుతుందని కంపెనీ వైస్–ప్రెసిడెంట్ (కార్పొరేట్ స్ట్రాటజీ) కె.ఎమ్. సునీల్ పేర్కొన్నారు. త్వరలో రికార్డ్ డేట్‌ను ప్రకటిస్తామని వెల్లడించారు. అనుబంధ కంపెనీల విలీనానికి ఎన్సీఎల్టీ ఆమోదం లభించిన నేపథ్యంలో పెన్నార్ ఇండస్ట్రీస్ షేర్ 1.7 శాతం నష్టంతో రూ.31.35 వద్ద ముగిసింది. పెబ్స్ షేర్ 4.4 శాతం నష్టంతో రూ. 52.15వద్దకు చేరింది. -
పెన్నార్ ఇండస్ట్రీస్ జోరు
కొత్త ఆర్డర్లతో ఉత్సాహం నెలలో 27% ఎగసిన షేరు సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: పెన్నార్ ఇండస్ట్రీస్ దాని అనుబంధ సంస్థలు తాజాగా రూ. 105 కోట్లు విలువ చేసే కొత్త ఆర్డర్లు చేజిక్కించుకోవటంతో బీఎస్ఈలో షేర్ ధర 3.40 శాతం పెరిగి రూ. 36.50 వద్ద క్లోజైంది. మంగళవారం జరిగిన ట్రేడింగ్‌లో షేర్ గరిష్ట ధర రూ. 36.85 కాగా కనిష్ట ధర రూ 34.85గా నమోదైంది. గత నెల రోజులుగా షేర్ ధర 27.44 శాతం పెరిగింది. అదే సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ కేవలం 4.43 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత మూడు నెలలుగా పెన్నార్ షేర్ ధర 75.62 శాతం వృద్ధిని నమోదు చేయగా సెన్సెక్స్ కేవలం 15.5 శాతం మాత్రమే పెరిగింది. అంటే మార్కెట్లో సెన్సెక్స్ కన్నా ఐదింతలు జోరును పెన్నార్ షేర్ ప్రదర్శించిందన్న మాట. పెన్నార్ ఇండస్ట్రీస్‌తో పాటు సంస్థ అనుబంధ సంస్థలైన పెన్నార్ ఇంజినీర్డ్ బిల్డింగ్ సిస్టమ్స్, పెన్నార్ ఎన్విరో లిమిటెడ్ సంస్థలకు అల్ట్రాటెక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, అభిర్ ఇన్ఫ్రా, ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, బీజీఆర్ ఎనర్జీ, జేఎస్‌డబ్ల్యూ, ఎస్ఆర్కే ఇంజినీరింగ్‌ల నుండి తాజా ఆర్డర్లు లభించినట్లు సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఆదిత్య రావు తెలిపారు. సోలార్ మాడ్యూల్ మౌంటింగ్ సిస్టమ్స్ వ్యాపారంలో మంచి వృద్ధి అవకాశాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. బైబ్యాక్ ఆఫర్...: పెన్నార్ సంస్ధ 40 లక్షల ఈక్విటీ షేర్లను ఒక్కో షేర్‌ను రూ. 40 చొప్పున బైబ్యాక్ చేసేందుకు గతేడాది జూన్‌లో ఇచ్చిన ఆఫర్ ఈ నెల 9న ముగిసిందని కంపెనీ తెలిపింది. బైబ్యాక్ ద్వారా సంస్థ 16,74,486 షేర్లను కొనుగోలు చేసింది. పెన్నార్ ఇండస్ట్రీస్ ఈక్విటీ క్యాపిటల్ రూ. 60.24 కోట్లు. షేర్ ముఖ విలువ రూ. 5.