చెల్లింపుల బ్యాంక్లో పేటీఎం వాలెట్ వ్యాపారం విలీనం | Paytm to transfer wallet business to payments bank | Sakshi
Sakshi News home page

చెల్లింపుల బ్యాంక్లో పేటీఎం వాలెట్ వ్యాపారం విలీనం

Dec 6 2016 12:44 AM | Updated on Sep 4 2017 9:59 PM

చెల్లింపుల బ్యాంక్లో పేటీఎం వాలెట్ వ్యాపారం విలీనం

చెల్లింపుల బ్యాంక్లో పేటీఎం వాలెట్ వ్యాపారం విలీనం

త్వరలో ఏర్పాటు చేయనున్న చెల్లింపుల బ్యాంకులో వాలెట్ వ్యాపార విభాగాన్ని విలీనం చేయనున్నట్లు పేటీఎం మాతృ సంస్థ ‘వన్97 కమ్యూనికేషన్స్’ వెల్లడించింది.

న్యూఢిల్లీ: త్వరలో ఏర్పాటు చేయనున్న చెల్లింపుల బ్యాంకులో వాలెట్ వ్యాపార విభాగాన్ని విలీనం చేయనున్నట్లు పేటీఎం మాతృ సంస్థ ‘వన్97 కమ్యూనికేషన్స్’ వెల్లడించింది. వాలెట్ విభాగం వ్యాపారం మొత్తం పేమెంట్స్ బ్యాంకుకు బదలారుుస్తామని, అమ్మకాల భాగాన్ని మాత్రమే వన్97 నిర్వహిస్తుందని కంపెనీ ప్రతినిధి తెలిపారు.

చెల్లింపుల బ్యాంకుకు సంబంధించి ఆర్‌బీఐ నుంచి తుది అనుమతులు పొందే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని వివరించారు. చైనా దిగ్గజం ఆలీబాబా గ్రూప్ తదితర ఇన్వెస్టర్ల నుంచి 680 మిలియన్ డాలర్లు సమీకరించిన వన్97 కమ్యూనికేషన్‌‌స... ఇటీవలే పేటీఎం ఈ-కామర్స్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పేరిట రెండు వేర్వేరు సంస్థలను నమోదు చేసింది. పేమెంట్స్ బ్యాంక్‌లో వన్97 వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మకు మెజారిటీ వాటాలుంటారుు.

Advertisement
 
Advertisement
Advertisement