నాలుగు నెలల ముందే లక్ష్యసాధన: పేటీఎం | Paytm hits $5 billion GMV, clocks Rs 120 crore worth of daily deals | Sakshi
Sakshi News home page

నాలుగు నెలల ముందే లక్ష్యసాధన: పేటీఎం

Nov 22 2016 1:28 AM | Updated on Sep 4 2017 8:43 PM

నాలుగు నెలల ముందే లక్ష్యసాధన: పేటీఎం

నాలుగు నెలల ముందే లక్ష్యసాధన: పేటీఎం

రూ.500, రూ.1,000 కరెన్సీ నోట్ల రద్దు వాలెట్ సంస్థలకు బాగా అనుకూలించింది.

న్యూఢిల్లీ: రూ.500, రూ.1,000 కరెన్సీ నోట్ల రద్దు వాలెట్ సంస్థలకు బాగా అనుకూలించింది. తమ ప్లాట్‌ఫామ్ ద్వారా రోజుకు 70 లక్షల లావాదేవీలు జరుగుతున్నాయని పేటీఎం పేర్కొంది. వీటి విలువ సుమారు రూ.120 కోట్లు ఉంటుందని తెలిపింది. దీంతో తాము 5 బిలియన్ డాలర్ల విలువైన జీఎంవీ అమ్మకాల లక్ష్యాన్ని నాలుగు నెలల ముందే సాధించామని పేర్కొంది. ఒక డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా జరిగిన వస్తువుల విక్రయానికి సంబంధించిన మొత్తం విలువనే జీఎంవీగా పరిగణలోకి తీసుకుంటాం. పేటీఎం జీఎంవీ గతేడాది 3 బిలియన్ డాలర్లుగా ఉంది. కాగా పేటీఎం.. మొబైల్ పేమెంట్ సర్వీసులతోపాటు ఈ-కామర్స్ సేవలను కూడా అందిస్తోంది. దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా జరిగే లావాదేవీల కన్నా తమ ప్లాట్‌ఫామ్ ఆధారంగా జరిగే ట్రాన్సాక్షన్లే ఎక్కువగా ఉన్నాయని పేటీఎం పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement