
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మేకిన్ ఇండియా ప్రాజెక్టు.. ఫలాలు 2020 నుంచి అందుతాయని నీతిఆయోగ్ డైరెక్టర్ జనరల్-డీఎంఈఓ సలహాదారు అనిల్ శ్రీవాస్తవ తెలిపారు. మేకిన్ ఇండియా ప్రాజెక్టు వల్ల 2020 నాటికి దేశంలో కొత్తగా 10 కోట్ల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ఆయన అంచనావేశారు. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా ప్రాజెక్టుల వల్ల దేశంలో పెట్టుబడి అవకాశాలు మరింత మెరుగయ్యాయని శ్రీవాస్తవ చెప్పారు.
న్యూఢిల్లిలో జరిగిన స్మార్ట్‌టెక్ మ్యానేఫ్యాక్చరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇండియా-2017 సదస్సులో మాట్లాడారు. మేకిన్ ఇండియా ప్రాజెక్ట్‌లో బాగంగా 2020 నాటికి భారత్.. తన దిగుమతులను సున్నాస్థాయికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తోందని అన్నారు. ఈ సదస్సులో దేశంలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌కు అనుకూలంగా, ప్రతికూలంగా ఉన్న అంశాలపై మేధావులు చర్చలు జరిపారు.