మోబిక్విక్లో ‘నెట్ 1’ రూ.268 కోట్ల పెట్టుబడులు | Net 1 company invested in Moby quick 268cr | Sakshi
Sakshi News home page

మోబిక్విక్లో ‘నెట్ 1’ రూ.268 కోట్ల పెట్టుబడులు

Aug 27 2016 1:31 AM | Updated on Sep 4 2017 11:01 AM

మోబిక్విక్లో ‘నెట్ 1’ రూ.268 కోట్ల పెట్టుబడులు

మోబిక్విక్లో ‘నెట్ 1’ రూ.268 కోట్ల పెట్టుబడులు

దక్షిణాఫ్రికాకు చెందిన పేమెంట్ సంబంధిత కార్యకలాపాలను నిర్వహించే ‘నెట్ 1’ కంపెనీ..

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాకు చెందిన పేమెంట్ సంబంధిత కార్యకలాపాలను నిర్వహించే ‘నెట్ 1’ కంపెనీ.. భారత్‌కు చెందిన డిజిటల్ పేమెంట్ సంస్థ ‘మోబిక్విక్’లో రూ.268 కోట్లమేర ఇన్వెస్ట్ చేయనున్నది. ఈ మేరకు ఇరు కంపెనీల మధ్య ఒక వ్యూహాత్మక సబ్‌స్క్రిప్షన్ ఒప్పందం కుదిరింది. దీంతో నెట్ 1కి చెందిన వర్చువల్ కార్డ్ టెక్నాలజీ ఇకపై అన్ని మోబిక్విక్ వాలెట్లతో అనుసంధానం కానున్నది. మోబిక్విక్‌కు 3.2 కోట్ల మొబైల్ వాలెట్ యూజర్లు ఉన్నారు. వచ్చే మూడేళ్లలో వీరి సంఖ్యను 15 కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement