
న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ఆగిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అభిప్రాయపడింది. గతంలో గుజరాత్, కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సమయంలో ప్రభుత్వం ధరల పెరుగుదలను నిలిపివేసిన మాదిరిగా ఈసారి కూడా తాత్కాలిక ఆంక్షలు విధించే అవకాశం ఉందని పేర్కొంది.
ఏప్రిల్–మే సమయంలో సాధారణ ఎన్నికల షెడ్యూల్ ఉండగా.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈకాలంలో ధరల పెంపు నిర్ణయం తీసుకోవద్దని ఆదేశించే అవకాశం ఉందని అంచనావేస్తోంది. ఈ నిర్ణయం వెలువడితే ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ సంస్థల లాభాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని విశ్లేషించింది.