68.5 లక్షలకే కొత్త మోడల్ మెర్సిడెజ్ బెంజ్! | Mercedes Benz launches CLA 45 AMG at Rs 68.5 lakh | Sakshi
Sakshi News home page

68.5 లక్షలకే కొత్త మోడల్ మెర్సిడెజ్ బెంజ్!

Jul 22 2014 3:40 PM | Updated on Sep 2 2017 10:42 AM

68.5 లక్షలకే కొత్త మోడల్ మెర్సిడెజ్ బెంజ్!

68.5 లక్షలకే కొత్త మోడల్ మెర్సిడెజ్ బెంజ్!

జర్మనీ దేశానికి చెందిన కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ మార్కెట్లోకి సెడాన్ సీఎల్ఏ 45 ఏఎంజీ మోడల్ ను మంగళవారం విడుదల చేసింది.

గ్రేటర్ నోయిడా: జర్మనీ దేశానికి చెందిన కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ మార్కెట్లోకి సెడాన్ సీఎల్ఏ 45 ఏఎంజీ మోడల్ ను మంగళవారం విడుదల చేసింది. మార్కెట్ లో  ఈ మోడల్ ఎక్స్ షో రూం ధర 68.5 లక్షలు. లగ్జరీ కార్లకు మార్కెట్ లో డిమాండ్ ఉన్న కారణంగా వచ్చే ఆరు నెలల్లో సీఎల్ఏ క్లాస్ సెడాన్ మోడల్స్ ను విడుదల చేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. 
 
సీఎల్ఏ 45 ఏఎంజీ విడుదలతో దేశ వాహన రంగంలో ముందడుగు అని మెర్సిడెజ్ బెంజ్ ఇండియా ఎండీ తెలిపారు. గత సంవత్సరంలో అమ్మకాలు పెరగడంతో 2014లో పది రకాల ఉత్పత్తులను విడుదల చేస్తామన్నారు.  గత సంవత్సరం భారతదేశంలో 9003 కార్లను అమ్మినట్టు మెర్సిడెజ్ బెంజ్ వెల్లడించింది. డిమాండ్ కు అనుగుణంగా దేశంలోని చకాన్ ప్లాంట్ లో 20 వేల యూనిట్లను ఉత్పత్తి చేస్తోందని కంపెనీ తెలిపింది. 

Advertisement
 
Advertisement
Advertisement