లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్.. భారతదేశంలో తన కొత్త ఎలక్ట్రిక్ జీ-క్లాస్ కోసం అధికారికంగా రీకాల్ ప్రారంభించింది. కంపెనీ రీకాల్ ప్రకటించడానికి కారణం ఏమిటి?, ఈ ప్రభావం ఎన్ని కార్లమీద పడుతుంది? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
వీల్ బోల్ట్‌లకు సంబంధించిన సమస్య కారణంగా మెర్సిడెస్ బెంజ్ ఈ రీకాల్ ప్రకటించింది. దీని ప్రభావం 99 కార్లపై పడుతుంది. అంటే 99 కార్లకు రీకాల్ ప్రకటించారన్నమాట. కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు.. వీల్ బోల్ట్‌ల బిగింపు వల్ల, రానున్న రోజుల్లో వీల్ కనెక్షన్ వదులయ్యే అవకాశం ఉంది. దీనివల్ల వాహనం నడిపే స్థిరత్వం దెబ్బతినవచ్చు, ప్రమాదం జరిగే అవకాశం కూడా పెరగవచ్చు.
కంపెనీ ప్రకారం.. 12 జూలై 2024, 18 ఆగస్టు 2025 మధ్య తయారైన మొత్తం 99 యూనిట్లు ఈ రీకాల్ వల్ల ప్రభావితమయ్యాయి. అధికారిక ప్రకటన ఏదీ జారీ చేయనప్పటికీ, ఈ సమస్యను కస్టమర్‌కు ఎటువంటి ఖర్చు లేకుండా పరిష్కరించనున్నట్లు సమాచారం. అంతే కాకుండా.. కార్ల తయారీ సంస్థ సంబంధిత డీలర్‌షిప్‌ల ద్వారా ప్రభావితమైన కార్ల యజమానులను సంప్రదించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: టయోటా కొత్త కారు లాంచ్: 543 కిమీ రేంజ్!


