టయోటా కొత్త కారు లాంచ్: 543 కిమీ రేంజ్! | Toyota Urban Cruiser Ebella Launched At Rs 23 60 Lakh | Sakshi
Sakshi News home page

టయోటా కొత్త కారు లాంచ్: 543 కిమీ రేంజ్!

May 29 2026 3:05 PM | Updated on May 29 2026 3:30 PM

Toyota Urban Cruiser Ebella Launched At Rs 23 60 Lakh

టయోటా కంపెనీ భారతీయ మార్కెట్లో 'అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా' పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.23.60 లక్షలు (ఎక్స్ షోరూమ్). మారుతి సుజుకి ఈ విటారా ప్లాట్‌ఫారమ్‌ ఆధారంగా తయారైన ఈ మోడల్.. ప్రత్యేకమైన డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది.

సరికొత్త అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా ముందుభాగంలో టయోటా అంతర్జాతీయ మార్కెట్‌లో ఉపయోగించే స్టైలిష్ డిజైన్ కనిపిస్తుంది. బోనెట్‌, సైడ్ ప్రొఫైల్ అన్నీ కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి. క్యారెక్టర్ లైన్లు, ఏరోడైనమిక్ డిజైన్ గల అలాయ్ వీల్స్ కూడా ఇక్కడ గమనించవచ్చు.

కేఫ్ వైట్, బ్లూయిష్ బ్లాక్, గేమింగ్ గ్రే, స్పోర్టిన్ రెడ్, ఎంటైసింగ్ సిల్వర్ వంటి రంగులలో అందుబాటులో ఉండే.. ఈ కొత్త ఎబెల్లా కారు పరిమాణం పరంగా కూడా ఉత్తమంగా ఉంటుంది. ఇందులో 10.1 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, జేబీఎల్ సౌండ్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్, డయల్ టైప్ గేర్ షిఫ్ట్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఏడు ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, లెవెల్ 2 ఏడీఏఎస్ సిస్టం వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి.

ఇదీ చదవండి: ఎంజీ మెజెస్టర్ లాంచ్.. ఫార్చ్యూనర్‌కు గట్టి పోటీ!

పనితీరు విషయానికి వస్తే.. అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా 61 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది 171 హార్స్ పవర్, 193 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసే ఎలక్టిక్ మోటారును కలిగి.. ఒక ఫుల్ ఛార్జితో 543 కిమీ రేంజ్ ఇస్తుంది. ఈ కొత్త ఈవీ దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, టాటా కర్వ్ ఈవీ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement