ఎంజీ మెజెస్టర్ లాంచ్.. ఫార్చ్యూనర్‌కు గట్టి పోటీ! | MG Majestor Launched In India At Rs 40.99 Lakh, Check Out Specifications And Other Details Inside | Sakshi
Sakshi News home page

ఎంజీ మెజెస్టర్ లాంచ్.. ఫార్చ్యూనర్‌కు గట్టి పోటీ!

May 28 2026 9:19 PM | Updated on May 29 2026 5:53 PM

MG Majestor Launched in India at Rs 40 99 Lakh

జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా .. భారతీయ మార్కెట్లో మెజెస్టర్‌ను లాంచ్ చేసింది. గ్లోస్టర్ స్థానంలో విడుదలైన ఈ కారు ప్రారంభ ధర రూ.40.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది టయోటా ఫార్చ్యూనర్ , వోక్స్‌వ్యాగన్ టేరాన్ ఆర్-లైన్ , జీప్ మెరిడియన్, స్కోడా కోడియాక్‌ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

నాలుగు రంగులలో, 4x2, 4x4 కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉండే ఎంజీ మెజెస్టర్‌ డిజైన్ పరంగా గ్లోస్టర్ దృఢంగా ఉంటుంది. భారీ ఫ్రంట్ గ్రిల్, స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ సెటప్ ఉన్నాయి. ఐదు మీటర్లకు పైగా పొడవు, 2,950mm వీల్‌బేస్‌తో, ఇది తన సెగ్మెంట్‌లోని అతిపెద్ద కారుగా నిలిచింది.

ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం డ్యూయల్ 12.3-అంగుళాల డిస్‌ప్లేలు, పనోరమిక్ సన్‌రూఫ్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ వైర్‌లెస్ ఛార్జర్లు, 12-స్పీకర్ల జేబీఎల్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. డ్రైవర్ సీటుకు మెమరీ, వెల్కమ్ ఫంక్షన్‌తో కూడిన పవర్ అడ్జస్ట్‌మెంట్ లభిస్తుంది, అలాగే ముందు సీట్లలో వెంటిలేషన్, మసాజ్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి.

ఎంజీ మెజెస్టర్ 213 Bhp పవర్ 478.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్‌ పొందుతుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలో లభిస్తుంది. మెకానికల్ సెటప్ మారలేదు. ట్రిపుల్ డిఫరెన్షియల్ లాక్స్, మల్టిపుల్ టెర్రైన్ మోడ్‌ మొదలైనవి ఉన్నాయి.

ఇదీ చదవండి: 2026 టియాగో ఈవీ లాంచ్: ధర రూ.4.70 లక్షలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement