బెంజ్ స్పెషల్ ఎడిషన్స్.. ధరలు ఇలా! | Mercedes Benz GLE GLS Night Edition Launched | Sakshi
Sakshi News home page

బెంజ్ స్పెషల్ ఎడిషన్స్.. ధరలు ఇలా!

May 22 2026 8:20 PM | Updated on May 22 2026 8:26 PM

Mercedes Benz GLE GLS Night Edition Launched

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్.. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే తమ రెండు ఎస్యూవీలు GLE, GLS కార్లను నైట్ ఎడిషన్‌ పేరుతొ లాంచ్ చేసింది. ఇవి లిమిటెడ్ ఎడిషన్ రూపంలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇవి చూడటానికి స్టాండర్డ్ వేరియంట్ కంటే కూడా భిన్నంగా ఉంటుంది.

జీఎల్ఈ నైట్ ఎడిషన్ 300డీ 4మ్యాటిక్ ధర రూ. 1.05 కోట్లు, 450 4మ్యాటిక్ ధర రూ. 1.14 కోట్లుగా ఉంది. అయితే జీఎల్ఎస్ నైట్ ఎడిషన్ 450 4మ్యాటిక్ ధర రూ. 1.41 కోట్లు, 450d 4మ్యాటిక్ ధర రూ. 1.43 కోట్లు(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)గా ఉంది.ఈ ధరలు స్టాండర్డ్ మోడల్స్ కంటే కూడా ఎక్కువ.

బెంజ్ నైట్ ఎడిషన్స్ రెండూ కూడా అబ్సిడియన్ బ్లాక్, ఆల్పైన్ గ్రే అనే రంగుల్లో లభిస్తుంది. లోపల రెండు మోడళ్లలోనూ బ్లాక్ నాప్పా లెదర్ అప్‌హోల్స్టరీ.. ఆంత్రాసైట్ ఓపెన్ పోర్ ఓక్ వుడెన్ ట్రిమ్ ఉన్నాయి. రెండు మోడళ్లలోనూ హెడ్స్ అప్ డిస్‌ప్లే స్టాండర్డ్‌గా వస్తుంది. కాగా ఇంజిన్, పనితీరులో ఎలాంటి మార్పులు లేదు.

కేవలం బెంజ్ కంపెనీ మాత్రమే కాకుండా.. ఇతర ఆటోమొబైల్ సంస్థలు కూడా అప్పుడప్పుడు స్పెషల్స్ ఎడిషన్స్ లాంచ్ చేస్తుంటాయి. అయితే ఇలాంటి కార్లు పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి వీటికి మార్కెట్లో డిమాండ్ కూడా కొంత ఎక్కువగా ఉంటుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement