గూగుల్ నుంచి వీడియో కాలింగ్ యాప్ | Meet Google Duo, a simple 1-to-1 video calling app for everyone | Sakshi
Sakshi News home page

గూగుల్ నుంచి వీడియో కాలింగ్ యాప్

Aug 17 2016 12:31 AM | Updated on Apr 6 2019 9:01 PM

గూగుల్ నుంచి వీడియో కాలింగ్ యాప్ - Sakshi

గూగుల్ నుంచి వీడియో కాలింగ్ యాప్

ఫేస్‌టైమ్, స్కైప్ వంటి వీడియో కాలింగ్ యాప్స్‌కి పోటీ గా టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా డ్యువో పేరిట యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.

న్యూఢిల్లీ: ఫేస్‌టైమ్, స్కైప్ వంటి వీడియో కాలింగ్ యాప్స్‌కి పోటీ గా టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా డ్యువో పేరిట యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఆపరే టింగ్ సిస్టమ్‌ల ఆధారిత స్మార్ట్‌ఫోన్లలో ఇది పనిచేస్తుంది. వీడియో కాలింగ్‌ను మరింత సులభతరం చేసే ఈ యాప్‌ను మరికొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా యూజర్లందరికీ అందుబాటులోకి తేనున్నట్లు గూగుల్ గ్రూప్ ప్రోడక్ట్ మేనేజర్ అమిత్ ఫులే తెలిపారు. విడిగా యూజర్‌నేమ్/అకౌంట్ లాంటివి అక్కర్లేకుండా యూజర్లు తమ ఫోన్ నంబర్‌నే ఉపయోగించి డ్యువో ద్వారా వీడియో కాల్ చేయొచ్చని వివరించారు. తక్కువ బ్యాండ్‌విడ్త్‌లోనూ మెరుగ్గా పనిచేసేలా దీన్ని తీర్చిదిద్దినట్లు అమిత్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement