ఏపీ ప్రభుత్వంతో మారుతీ సుజుకీ భాగస్వామ్యం | Maruti Suzuki to Set Up Driver Training and Research Institute in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీ ప్రభుత్వంతో మారుతీ సుజుకీ భాగస్వామ్యం

Jul 1 2016 1:12 AM | Updated on Jun 2 2018 2:36 PM

ఏపీ ప్రభుత్వంతో మారుతీ సుజుకీ భాగస్వామ్యం - Sakshi

ఏపీ ప్రభుత్వంతో మారుతీ సుజుకీ భాగస్వామ్యం

దేశీ ప్రముఖ ప్యాసెంజర్ వాహన తయారీ కంపెనీ ‘మారుతీ సుజుకీ’ తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది.

హైదరాబాద్: దేశీ ప్రముఖ ప్యాసెంజర్ వాహన తయారీ కంపెనీ ‘మారుతీ సుజుకీ’ తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా కంపెనీ ప్రకాశం జిల్లాలోని దర్శి పట్టణానికి సమీపంలో ఉన్న వెంకటాచలం గ్రామంలో డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. ఒప్పందం ప్రకారం ఏపీ ప్రభుత్వం సెంటర్ ఏర్పాటుకు మారుతీ సుజుకీకి 20 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తుంది.

సెంటర్ ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలను కంపెనీ చూసుకుంటుంది. పీపీపీ మోడల్‌లో కంపెనీ దక్షిణ భారతదేశంలో తొలిగా ఏర్పాటు చేస్తోన్న ఈ సెంటర్ నిర్మాణం 2018 నాటికి పూర్తికావొచ్చు. ఏపీ ప్రభుత్వాధికారులు, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్‌లకు చెందిన ఉన్నతాధికారుల సమక్షంలో ఎంఓయూలను మార్చుకుంటున్న ఏపీ ట్రాన్స్‌పోర్ట్ కమీషనర్ ఎన్.బాలసుబ్రమణ్యం, మారుతీ సుజుకీ డ్రైవింగ్ ట్రైనింగ్ ఏవీపీ మహేశ్ రజోరియాలను చిత్రంలో చూడొచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement