మధుకాన్ ప్రాజెక్ట్స్ లాభం రూ. 9 కోట్లు | madhucon projects net profit 9crores | Sakshi
Sakshi News home page

మధుకాన్ ప్రాజెక్ట్స్ లాభం రూ. 9 కోట్లు

Jun 1 2016 1:40 AM | Updated on Sep 4 2017 1:21 AM

మధుకాన్ ప్రాజెక్ట్స్ లాభం రూ. 9 కోట్లు

మధుకాన్ ప్రాజెక్ట్స్ లాభం రూ. 9 కోట్లు

గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో మధుకాన్ ప్రాజెక్ట్స్ నికర లాభం రూ. 16 కోట్ల నుంచి సుమారు రూ. 9 కోట్లకు (స్టాండెలోన్) క్షీణించింది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో మధుకాన్ ప్రాజెక్ట్స్ నికర లాభం రూ. 16 కోట్ల నుంచి సుమారు రూ. 9 కోట్లకు (స్టాండెలోన్) క్షీణించింది. మరోవైపు, ఆదాయం సైతం రూ. 301 కోట్ల నుంచి రూ. 251 కోట్లకు తగ్గింది. మరోవైపు, పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయం రూ. 1,137 కోట్ల నుంచి రూ. 718 కోట్లకు తగ్గగా.. లాభం రూ. 49 కోట్ల నుంచి రూ. 25 కోట్లకు క్షీణించింది. మధుకాన్ ఇన్‌ఫ్రా సహా నామో హోటల్స్, రాంచీ ఎక్స్‌ప్రెస్‌వేస్ తదితర అనుబంధ సంస్థలన్నీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయని, పలు సంస్థల నికర విలువ గణనీయంగా క్షీణించిందని కంపెనీ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement